YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష చూపిస్తున్న కేంద్రం మంత్రి కేటీఆర్

తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష చూపిస్తున్న కేంద్రం మంత్రి కేటీఆర్

న్యూఢిల్లీ ఏప్రిల్ 20
న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని కేంద్ర స‌ర్కార్ .. నిరాటంకంగా తెలంగాణ ప‌ట్ల వివ‌క్ష చూపిస్తూనే ఉంద‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆధ్వ‌ర్యంలో గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో సంప్ర‌దాయ వైద్య కేంద్రాన్ని ప్రారంభిచ‌డాన్ని మంత్రి కేటీఆర్ త‌ప్పుప‌ట్టారు. సంప్ర‌దాయ వైద్య కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేస్తార‌ని గ‌తంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హామీ ఇచ్చార‌ని, కానీ నాన్ ప‌ర్ఫార్మింగ్ అసెట్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి ఆ ప్ర‌తిష్టాత్మ‌క జాతీయ కేంద్రాన్ని రాష్ట్రానికి తీసుకురావ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు కేటీఆర్ విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిషిన‌ల్ మెడిసిన్ కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ భావిస్తోంద‌ని, ఈ సెంట‌ర్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల.. అది న‌గ‌రాన్ని, రాష్ట్రాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని గ‌తంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సెంట‌ర్ జామ్‌న‌గ‌ర్‌కు వెళ్ల‌డంతో కిష‌న్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.సంప్ర‌దాయ వైద్య కేంద్రాన్ని మంత్రి కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి తీసుకువ‌చ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లే చెప్పిన మంత్రి కేటీఆర్‌.. కాస్త ఆగండి.. గుజ‌రాత్ ప్ర‌ధాని ఆ కేంద్రాన్ని జామ్‌న‌గ‌ర్‌కు తీసుకువెళ్లిన‌ట్లు త‌న ట్వీట్‌లో కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌ధాని మోదీ వివ‌క్ష ఓ ధారావాహికంలా సాగుతోంద‌ని, తెలంగాణ‌కు నిరాటంకంగా అన్యాయం జ‌రుగుతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు.కేంద్ర ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల‌కు మంజూరీ చేసిన జాతీయ ఇన్స్‌టిట్యూట్ల వివ‌రాల‌ను కూడా మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్‌, ఐఐఐటీ, ఎన్ఐడీ, మెడిక‌ల్ కాలేజీలు, న‌వోద‌య స్కూళ్లను ఇత‌ర రాష్ట్రాల‌కు మంజూరీ చేశార‌ని, కానీ తెలంగాణ‌కు ఒక్క‌టి కూడా ఇవ్వ‌లేద‌ని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రాష్ట్ర పున‌ర్ విభ‌జ‌న చ‌ట్టంలో హామీ ఇచ్చిన గిరిజ‌న వ‌ర్సిటీని ఏర్పాటు చేయ‌లేద‌న్నారు. దానికి సంబంధించిన డేటాను కూడా ఆయ‌న ప్ర‌జెంట్ చేశారు.

Related Posts