YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎర్రకోట నుంచి మోడీ ప్రసంగం

ఎర్రకోట నుంచి  మోడీ ప్రసంగం

న్యూఢిల్లీ, ఏప్రిల్  20
ఇప్పటి వరకు వస్తున్న సంప్రదాయాన్ని బ్రేక్‌ చేస్తూ ఏప్రిల్ 21వ తేదీన సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. సంప్రదాయం ప్రకారం.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, సిక్కుల మతగురువు తేజ్‌బహుదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని.. ఎర్రకోటలో సంప్రదాయానికి భిన్నంగా.. సూర్యాస్తమయం తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు నరేంద్ర మోడీ.. అయితే, స్వాతంత్ర దినోత్సవం వేడుకల సమయంలో ప్రసంగించే ప్రదేశంలో కాకుండా మరో ప్రాంతంలో ఈ ప్రసంగం చేయనున్నారు..ఎర్రకోటలోని పచ్చిక బయళ్ల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.. ప్రధాని మోదీ ప్రసంగానికి ఎర్రకోటను వేదికగా ఎందుకు ఎంచుకున్నారు? అనే అంశానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.. 1675లో తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్‌ మరణశిక్షకు అప్పటి ముఘల్రాజు ఔరంగజేబ్ ఈ ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేసిన కారణంగా.. అందుకు ప్రతీకగా ఇక్కడే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు.. ఎర్రకోట యొక్క ప్రాకారము నుండి ప్రధానులు స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. కానీ, ప్రధాని మోడీ గురువారం రాత్రి 9.30 గంటలకు ప్రసంగిస్తారని, ఆయన ప్రసంగం సర్వమత శాంతి, వర్గాల మధ్య సామరస్యం గురించి ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు కాకుండా స్మారక చిహ్నంపై నుంచి మోడీ ప్రసంగించడం ఇది రెండోసారి. 2018లో ఆయన స్మారక చిహ్నం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేత ఆజాద్ హింద్ పౌంజ్‌ ఏర్పాటు చేసిన 75వ వార్షికోత్సవాన్ని స్మరించుకున్నారు. .ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆయన ప్రసంగించిన విషయం తెలిసిందే.. ఇక, గురువారం జరిగే కార్యక్రమంలో 400 మంది సిక్కు సంగీత కళాకారుల ప్రదర్శనలు ఉండబోతున్నాయి.. ఈ సందర్భంగా మోడీ.. స్మారక నాణెం, తపాలా స్టాంపును కూడా విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.మరోవైపు ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న నేపథ్యంలో.. భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.. ఎర్రకోట వద్ద 1,000 మంది ఢిల్లీ పోలీసులు, వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో కూడిన బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.. ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ప్రదేశంతో సహా ఎర్రకోట ప్రాంగణంలో ఇప్పటికే 100కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారుల వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్‌ఎస్‌జీ స్నిపర్లు, SWAT కమాండోలు, గాలిపటాలు క్యాచర్లు, కనైన్ యూనిట్లు మరియు ఎత్తైన భవనాలపై షార్ప్‌షూటర్లతో సహా భద్రతా రింగ్… మొఘల్ కాలం నాటి కోట వద్ద మోహరిస్తున్నారు.. ఇక, కరోనా కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో.. భౌతిక దూరం నిబంధనలను పాటించడం తప్పనిసరి అంటున్నారు అధికారులు.. శనివారం నగరంలోని జహంగీర్‌పురి ప్రాంతంలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన ఘర్షణలో తొమ్మిది మంది పోలీసులు మరియు ఒక పౌరుడు గాయపడిన నేపథ్యంలో.. ఎర్రకోట వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.

Related Posts