YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చర్చనీయంశంగామారిన పోత్తులపై వ్యాఖ్యలు

చర్చనీయంశంగామారిన పోత్తులపై వ్యాఖ్యలు

విశాఖపట్నం
పొత్తులపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్య లు రాజకీయంగా చర్చనీయాం శమ య్యాయి. ఎన్నికలకు ఇంకా సమయం చాలానే ఉంది.అప్పుడే రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో మళ్లీ అధికారమే దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. ఒంటరిగానే పోటీ చేస్తుందా లేదా ఇతర పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పొత్తులపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీ యాంశమయ్యాయి. విశాఖపట్టణానికి వచ్చిన ఎంపీ విజయసాయి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే పార్టీకే వైసీపీ సపోర్టు ఉంటుందని, విధానపరమైన నిర్ణయాలపై సీఎం జగన్ స్పందిస్తార న్నారు. పార్టీ పదవులపైనా కూడా స్పందించారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయమే శిరోధార్యమని వెల్లడించిన ఆయన ప్రాంతీయ పార్టీల అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటారో.. తనకు అది కావాలి.. ఇది కావాలి అనే ప్రస్తావన రాదన్నారు. మరోవైపు కాంగ్రెస్ తో పొత్తు వ్యాఖ్యలపై మంత్రి అమ ర్నాథ్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైసీపీ పుట్టిందని, స్ట్రాటజీస్ చెప్పినట్లు చేయాలా అని ప్రశ్నించారు. దేశంలో కాంగ్రెస్ ను భూ స్థాపితం అవడా నికి పునాది వేసిందే సీఎం జగన్ అని, సోనియా గాంధీ ని ఎదిరించే వారు అప్పట్లో లేరని తెలిపారు.2004 నుంచి 2014 వరకు దేశ రాజకీయాలను సోనియా శాసిస్తున్న సమయంలో.. జగన్ ధైర్యం చేశాడన్నారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీట్లు వెతుక్కొనే పరిస్థితి తీసుకొచ్చింది జగన్ అని.. ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే జనాలు నవ్వు కుంటారని తెలిపారు.

Related Posts