YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

పాకిస్థాన్‌కు చైనా గ‌ట్టి వార్నింగ్

పాకిస్థాన్‌కు చైనా గ‌ట్టి వార్నింగ్

న్యూ డిల్లీ మే 11
పాకిస్థాన్‌కు చైనా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. త‌మ‌కు చెల్లించాల్సిన 30వేల కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించాల‌ని ప‌లు చైనా కంపెనీలు పాక్‌ను డిమాండ్ చేశాయి. చెల్లించ‌కుంటే పాకిస్థాన్‌లోని త‌మ కంపెనీల‌ను మూసివేస్తామ‌ని హెచ్చ‌రించాయి. పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ మంత్రి ఆసాన్ ఇక్బాల్‌తో స‌మావేశం అనంత‌రం చైనీస్ ఇండిపెండెంట్ ప‌వ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ (ఐపీపీఎస్‌) ఈ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు డాన్ ప‌త్రిక ఒక క‌థ‌నం ప్ర‌చురించింది.చైనా-పాక్ ఎక‌న‌మిక్ కారిడార్ ( సీపెక్ )లో భాగంగా 30 చైనా కంపెనీలు పాకిస్థాన్‌లో విద్యుత్ క‌మ్యూనికేష‌న్లు, ర‌హ‌దారులు, రైల్వేకు సంబంధించిన‌, ఇత‌ర‌త్రా సేవ‌ల‌ను అందిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించిన 30 వేల కోట్ల రూపాయ‌లు స‌ద‌రు కంపెనీల‌కు పాకిస్థాన్ ప్ర‌భుత్వం బ‌కాయి ప‌డింది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ మినిస్ట‌ర్ ఆసాన్ ఇక్బాల్‌తో చైనీస్ ఇండిపెండెంట్ ప‌వ‌ర్ ప్రొడ్యూస‌ర్స్ మంగ‌ళ‌వారం స‌మావేశ‌మ‌య్యాయి. ఈ సంద‌ర్భంగా త‌మ‌కు చెల్లించాల్సిన బ‌కాయిల గురించి 25 కంపెనీల ప్ర‌తినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆ బ‌కాయిల‌ను త‌క్ష‌ణ‌మే చెల్లించాల‌ని లేదంటే త‌మ కంపెనీల‌ను త‌క్ష‌ణ‌మే మూసివేస్తామ‌ని హెచ్చ‌రించారు. అయితే ఈ అంశంపై పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ దృష్టి సారించార‌ని, నెల రోజుల్లోగా బ‌కాయిలు చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స‌ద‌రు కంపెనీల ప్ర‌తినిధుల‌కు పాక్ మంత్రి ఆసాన్ ఇక్బాల్ హామీ ఇచ్చారు.

Related Posts