
విశాఖపట్టణం, జూలై 7,
ఒకప్పుడు రేషన్ ఎలా తీసుకునే వాళ్లం, రేషన్ ఫాప్‌కు వెళ్లి మన దగ్గర ఉన్నరేషన్ కార్డుతో మ్యాన్‌వల్‌గా రాయించుకొని రేషన్ తీసుకునేవాళ్లాం. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన ఈ పాస్ యంత్రాల ద్వారా ఫింగర్ ప్రింట్ లేదా, ఐరిస్ స్కాన్ ద్వారా ఇప్పుడు రేషన్ తీసుకుంటున్నాం. అయితే ఈ యంత్రాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గమనించిన ప్రభుత్వం రేషన్ సేకరణ విధానాన్ని మరింత సులబతరం చేసేందుకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ఫేస్ అథంటికేషన్. దీని ద్వారా మనం ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒక్క ఫోటో దిగితే చాలు రేషన్ పొందవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త టెక్నాలజీని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తోంది.పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేయడానికి రాష్ట్రంలోని డిజిటల్ టెక్నాలజీ, గవర్నెన్స్ విభాగాన్ని ఈ నెల 1 తేదీ నుంచి ఆధార్ ఆధారిత ఫేస్ అథంటికేషన్ వ్యవస్థను ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా రేషన్ దుకాణాల్లో వినియోగదారుల ఫేస్‌ను స్కాన్ చేసి వారికి రేషన్ సరుకులను అధికారులు అందజుస్తున్నారు. ఈ ఫేస్ అథంటికేషన్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తున్న దేశంలో మొదటి రాష్ట్రంగా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ నిలిచింది.అయితే హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో లాగా ఈ పాస్ యంత్రం ద్వారానే రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగేది. కానీ ఈ యంత్రాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా ప్రజలు గంటల తరబడి రేషన్ షాప్‌ల వద్దే వేచి చూసే పరిస్థితి వచ్చింది. దీంతో పౌరసరఫరాల శాఖకు ప్రజలు నుంచి ఫిర్యాదులు రావడం పెరిగాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ సమస్యపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. వాటిని అదిగమించేందుకు ఈ ఫేస్ అథంటికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ కొత్త టెక్నాలజీని మొదటగా బిలాస్‌పూర్‌లో ప్రభుత్వం ట్రయల్‌రన్ నిర్వహించింది. అది సక్సెస్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల జిల్లా ఫుడ్ కంట్రోలర్లకు ఈ కొత్త టెక్నాలజీని అములు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక రేషన్ దుకాణాలలో ఈ టెక్నాలజీని వినియోగించే రేషన్ డీలర్స్ ప్రజలకు రేషన్ పంపిణీ చేస్తున్నారుఈ ఫేస్ అథంటికేషన్ కూడా సేమ్ మన బయోమెట్రిక్ లానే పనిచేస్తుంది. ఈ పాస్ యంత్రంలో మన ఫింగర్ ప్రింట్ నమోదు చేసిన వెంటనే ఎలాగైతే మన వివరాలు వస్తాయో.. ఈ ఫేస్ అథంటికేషన్‌లో కూడా.. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మన ముఖాన్ని స్కాన్ చేసిన వెంటనే, ఈ పాప్ యంత్రంలో వినియోగదారుల రేషన్ కార్డులో నమోదు అయి ఉన్న కుటుంబసభ్యులందరి పూర్తి వివరాలు వస్తాయి. అందులో మన పేరుపై క్లిక్ చేసి రేషన్‌ను మనం పొందవచ్చు. అయితే ఇందుకు రేషన్‌కార్డుకు కచ్చితంగా మన ఆధార్ లింక్ చేసి ఉండాలి.ఈ కొత్త టెక్నాలజీపై ప్రిన్సిపల్ అడ్వైజర్ గోకుల్ బుటెల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఈపాస్ యంత్రం ద్వారా బయోమెట్రిక్ మ్యాచింగ్ వైఫల్య సమస్యలు ఎదుర్కొన్నామని.. వాటిని అదిగమించేందుకే ఈ ఫేస్ అథంటిఫికేషన్ వ్యవస్థను తీసుకొచ్చినట్టు తెలిపారు. రేషన్ డీలర్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేసి లబ్ధిదారుడిని గుర్తించవచ్చని ఆయన తెలిపారు. ఇందుకు కోసం సురక్షితమైన మొబైల్ అప్లికేషన్‌ను వినియోగిస్తున్నామని.. ఇది నెట్‌వర్క్ కనెక్టివిటీ లేదా బయోమెట్రిక్ హార్డ్‌వేర్‌పై ఆధారపడదని ఆయన తెలిపారు.