YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోండి ప్రధాని మోడీ

ప్రభుత్వ పథకాల గురించి  తెలుసుకోండి   ప్రధాని మోడీ

న్యూఢిల్లీ, మే 12,
ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమాచారం తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. దీనివల్ల అర్హత లేని వ్యక్తులు ప్రయోజనం పొందుతారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో ప్రధాని మోడీ వర్చువల్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని ప్రజలతో ప్రత్యేకంగా సంభాషించారు. ప్రజలంతా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని.. వాటిని వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు. అధికారులు కూడా వీటి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియకపోవడం వల్ల, అవి కాగితానికే పరిమితమవడం లేదా.. అర్హత లేని వారికి ప్రయోజనం చేకూరడం జరుగుతుందని మోదీ అభిప్రాయపడ్డారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కీలక పథకాలను 100 శాతం లబ్ధిదారులకు చేరువైన సందర్భంగా ఉత్కర్ష్ కార్యక్రమం నిర్వహించారు. దీని ద్వారా అవసరమైన వారికి సకాలంలో ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. వితంతువులు, వృద్ధులు, నిరుపేద కుటుంబాలకు సహాయం అందించేందుకు వీలుగా పథకాలు పూర్తి స్థాయిలో అందించాలనే లక్ష్యంతో భరూచ్ జిల్లా యంత్రాంగం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 వరకు ‘ఉత్కర్ష్ ఇనిషియేటివ్’ డ్రైవ్‌ను నిర్వహించింది.నాలుగు పథకాల్లో మొత్తం 12,854 మంది లబ్ధిదారులను గుర్తించారు. గంగా స్వరూప ఆర్థిక్ సహాయ యోజన, ఇందిరా గాంధీ వృద్ధ సహాయ యోజన, నిరాధార్ వృద్ధ్ ఆర్థిక సహాయ యోజన – రాష్ట్ర కుటుంబ సహాయ యోజన పథకాలు ఉన్నాయి. డ్రైవ్ సమయంలో పథకాల ప్రయోజనాలను పొందని వారి గురించి సమాచారాన్ని సేకరించడానికి వీలుగా.. నియోజకవర్గం/తాలూకా వారీగా వాట్సప్  హెల్ప్‌లైన్ నంబర్‌లను ప్రకటించారు.జిల్లాలోని అన్ని గ్రామాలు మరియు మున్సిపాలిటీ ప్రాంతాల్లోని వార్డులలో ఉత్కర్ష్ శిబిరాలు నిర్వహించారు. ఇందులో అవసరమైన పత్రాలను అందించిన దరఖాస్తుదారులకు అక్కడికక్కడే ఆమోదం లభించింది. డ్రైవ్‌ను మరింత సులభతరం చేయడానికి ఉత్కర్ష్ సహాయకులకు ప్రోత్సాహకాలు కూడా అందించారు
 కూతుళ్లను బాగా చదివించండి యాకూబ్
గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ఉత్కర్ష్ సమరోహ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రజలతో ప్రత్యేకంగా సంభాషిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో దృష్టిలోపం ఉన్న యాకూబ్ పటేల్ అనే లబ్ధిదారుడితో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సంభాషించారు. దృష్టిలోపం ఎందుకు వచ్చింది.. డాక్టర్లు ఏమన్నారు అంటూ ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీ కుమార్తెలను చదివిస్తున్నారా..? అని యాకూబ్‌ను ప్రధాని మోడీ అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. తన ముగ్గురు కుమార్తెలు చదువుతున్నారని.. ఒకరు 12, మరొకరు 8, ఇంకొకరు 1వ తరగతి చదువుతున్నారన్నారు. వారిలో పెద్ద కుమార్తె డాక్టర్ కావాలని కోరుకుంటుందని యాకుబ్ తెలిపారు. అయితే.. పక్కన కూతురు ఉందా అంటూ అడిగారు.వెంటనే అక్కడ కూర్చున్న ఆలియాను.. వైద్య వృత్తిని కెరీర్‌గా ఎంచుకోవడానికి గల కారణం ఎంటని.. మోడీ ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. “మా నాన్న దృష్టిలోపంతో బాధపడుతున్న సమస్య కారణంగా నేను డాక్టర్‌ని కావాలనుకుంటున్నాను” అంటూ చెప్పింది. ఈ క్రమంలో.. బాలిక ప్రతిస్పందన అనంతరం ఉద్వేగానికి లోనైన ప్రధాని.. కొన్ని క్షణాలపాటు మౌనంగా చూస్తుండిపోయారు.. ఆమెతో మాట్లాడుతూ.. పట్టుదల ఆశయమే.. నీ బలం అంటూ ఆమెతో పేర్కొన్నారు.అనంతరం యాకూబ్ పటేల్‌ను.. రంజాన్ జరుపుకున్నారా..? ఎలా జరుపుకున్నారా..? కూతుళ్లకు ఏం ఇచ్చారు అంటూ మోడీ ఆరా తీశారు. బాగా జరుగుపుకున్నామని.. కొత్త డ్రెస్సులు కొనిచ్చానని యాకూబ్ తెలిపాడు. ఇంకా వ్యాక్సినేషన్ గురించి అడగగా.. తాము వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పాడు. పిల్లలను మంచిగా చదివించాలని.. వారి కలలను సాకారం చేయాలని మోడీ యాకూబ్ కు సూచించారు. అలాగే పిల్లల మనస్సులో కూడా అభిరుచి పెరగాలని మోడీ అభిప్రాయపడ్డారు.

Related Posts