YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలతో పటు మరో 10 మందికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలతో పటు మరో 10 మందికి హైకోర్టులో ఊరట

అమరావతి మే 16
పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి పి.నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి పొంగూరు సింధూర అల్లుడు కె.పునీత్తో పాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మందికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని..  హౌస్మోషన్ విధానంలో అత్యవసరంగా విచారించాలని అభ్యర్థిస్తూ వారు వ్యాజ్యాలు దాఖలు చేయగా..  వాటిపై న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు అత్యవసరంగా విచారణ జరిపారు.పిటిషనర్లపై బుధవారం(18వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. పూర్తి స్థాయి విచారణను అదే రోజుకు వాయిదా వేశారు. టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్లో మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదైంది. దాని ఆధారంగా ఈ నెల 10న పోలీసులు నారాయణను హైదరాబాద్లో అరెస్టు చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు.అయితే పోలీసులు అరెస్టు విషయంలో సీఆర్పీసీ 41ఏ నిబంధనలు పాటించలేదని న్యాయాధికారి అభ్యంతరం తెలిపారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నారాయణకు వర్తించవన్నారు. 2014లోనే ఆ విద్యాసంస్థల చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ ఆధారాలు చూపించడంతో అదే రోజు చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Related Posts