YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఒమిక్రాన్ తో ఉత్తరకొరియా విలవిల

ఒమిక్రాన్ తో ఉత్తరకొరియా విలవిల

న్యూఢిల్లీ, మే 18,
రెండేళ్లుగా కరోనా నుంచి బారినపడకుండా తనను తాను రక్షించుకున్న ఉత్తర కొరియాలో ప్రస్తుతం మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది.  రాజధాని ప్యోంగాంగ్‌లో తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి వనుంచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది కరోనా బారిన పడి చనిపోయారు.కరోనా మహమ్మారి వ్యాప్తిని ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దేశ చరిత్రలో ఘోరమైన విపత్తుగా పరిగణించి కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం, ప్రజలు కలిసి కరోనాతో పోరాడలని అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ మాస్క్‌తో కనిపించని ఆయన ఇప్పుడు మాస్క్‌ ధరించి దర్శనమివ్వటం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది..కోవిడ్‌ విషయంలో గత రెండున్నర ఏళ్లుగా బయటి నుంచి సాయం పొందటాన్ని కిమ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిన పొట్టన పెట్టుకోవటం చూసి కూడా టీకా పట్ల విముఖత ప్రదర్శించాడు. తమ సోషలిస్టు విధానాలతో కరోనా దేజంలో అడుగు పెట్టకుండా చేస్తామని ప్రగల్బాలు పలికాడు. కానీ, కరోనాకు అంతా సమానమే.. సోషలిజం ..క్యాపిటలిజం అనే తేడా లేదు. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పుడు ఉత్తర కొరియాకు దాని తాజా బాధితురాలిగా మారింది.ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజులలో దేశంలో బాధితుల సంఖ్య 8,20,620కు చేరింది. రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచే అధికంగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్‌గా నిర్థారణ అయిన వారిలో 3,24,550 మంది ప్రస్తుతం వైద్య చికిత్సం పొందుతున్నారు.అత్యంత అధ్వాన్నమైన ప్రజారోగ్యవ వ్యవస్థలను కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో దేశం తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్‌లు, యాంటీవైరల్ ట్రీట్‌మెంట్ డ్రగ్స్ , మాస్-టెస్టింగ్ సదుపాయాలు వంటి అందుబాటులో లేవు. వ్యాక్సిన్‌ సాయానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినా ఉత్తర కొరియా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో రెండున్నర కోట్ల ప్రజలు కరోనా టీకాకు దూరంగా ఉన్నారు.కరోనా పట్ల ఉత్తర కొరియా ప్రభుత్వం ఆది నుంచీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఐతే, పొరుగున ఉన్న చైనాలో ఇటీవల ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభించింది. అక్కడి నుంచే ఉత్తర కొరియాకు మహమ్మారి దిగుమతి అయిందని బావిస్తున్నారు.టీకా అందుబాటులో లేకపోవటంతో ప్రస్తుతం ఒమిక్రాన్‌ నియంత్రణకు కఠిన లాక్‌డౌన్‌ మినహా మరో మార్గం లేదు. ఇప్పటి వరకు మనం చూసిన వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్‌ పది రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. అందుకే, ఎన్ని కఠన చర్యలు అమలు చేసినా రోజు వారీ కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.దేశంలోని అన్ని ప్రావిన్సులు, నగరాలు, కౌంటీలు పూర్తిగా లాక్‌ డౌన్‌లోకి వెళ్లిపోయాయి.ఉత్తర కొరియా జీడీపీలో ఇరవై శాతాన్ని మిలటరీ మీద ఖర్చు చేస్తున్నారు. కానీ, ప్రజారోగ్యంపై ఖర్చు చేసేది అంతంత మాత్రమే. 2019లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 43 శాత మంది ఉత్తర కొరియా ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గత పాతికేళ్లలో క్షయ రోగుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 2016 లెక్కల ప్రకారం ప్రతి లక్ష మందికి 640 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఐతే, ఉత్తరకొరియా దీన స్థితిని చూసి లాభాపేక్ష లేని కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ దేశ ఆరోగ్య సంరక్షణ మెరుగుకు సాయం అందిస్తున్నాయి. 2010లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉత్తర కొరియాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పరిశోధన నిర్వహించింది. ఒక వ్యక్తిపై ఏడాదికి ఒక్క డాలర్‌ కూడా ఖర్చు చేయటం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇది తక్కువ. ఉత్తర కొరియా అనుసరించే రాజకీయ విధానలతో సంబంధం లేకుండా మానవతా దృక్ఫతంతో సహాయం చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలను కోరుతోంది.

Related Posts