YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైతుల ఖాతాలోకి కిసాన్ యోజన డబ్బులు

రైతుల ఖాతాలోకి  కిసాన్ యోజన డబ్బులు

న్యూఢి్ల్లీ, మే 23,
11వ విడత డబ్బులు రైతుల ఖాతాలోకి ఇప్పటికే పడాల్సి ఉన్నా, అనూహ్య కారణాల వల్ల అది ఆలస్యమైంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో అత్యంత కీలకమైన ఈ-కేవైసీ ఆప్షన్ ను కొంతకాలంపాటు తొలగించిన కేంద్రం.. తిరిగి ఆ సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తేవడం తెలిసిందే.
కేంద్రం ‘రైతు భాగస్వామ్యం-ప్రాధాన్యత హమారీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో రైతులకు KCC (కిసాన్ ) కార్డులు అందిస్తుండటం, ఈ పథకాన్ని కూడా PM కిసాన్ పథకానికి అనుసంధానించడంతో సాంకేతిక సమస్యలు రాకుండా ఈ-కేవైసీ ఆప్షన్ ను కొంత కాలం పాటు తొలగించి మళ్లీ తెచ్చారు.పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు ఉన్నట్లు గుర్తించిన కేంద్రం దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఫేక్ లబ్దిదారులను జల్లెడపట్టింది. లక్షల సంఖ్యలో తప్పుడు అకౌంట్లను తొలగించింది. వడ పోత ముగిసిన నేపథ్యంలో పీఎం కిసాన్ 11వ విడత లబ్దిదారుల జాబితా తాజాగా విడుదలైంది. పీఎం కిసాన్ 11వ విడత డబ్బుల పంపిణీ మే 31న చేపడతామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇదివరకే చెప్పారు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో పంపిణీ ప్రక్రియ సోమవారానికే ముగిసింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్ డేట్స్ ఉన్నాయి.
పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు ఇవాళ ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని రైతులకు అందాయి. ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ మొత్తం 1804 కోట్ల రూపాయలను సోమవారం నాడు రైతుల ఖాతాల్లోకి వేశారు. ఈ కేవైసీ పూర్తి చేయడానికి గడువు మే 31 వరకు ఉన్నా ఆ రాష్ట్రంలో పంపిణీ ప్రక్రియను చేపట్టడం గమనార్హం.తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఏపీలో గత వారమే జగన్ సర్కారు వైఎస్సార్ రైతు భరోసా డబ్బులు రూ.5500 రైతుల ఖాతాల్లోకి వేసింది. అయితే ఏపీతోపాటు తెలంగాణలోనూ పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు రూ.2000కు మే 31 వరకు ఆగాల్సిందే.
రైతులు ఈ-కేవైసీని అప్ డేట్ చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ డబ్బులు పొందొచ్చు. అందుకు చివరి తేదీని మే31గా నిర్ధారించారు. ఈ కేవైసీ చెక్ చేసుకునే విధానం నంబర్ల వారీగా.. 1. ముందుగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వెబ్‌సైట్‌పై తెరవాలి. 2. ఇందులో కుడివైపున ‘ఫార్మర్స్ కార్నర్’ కనిపించనుంది. ఇందులో బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)తెలంగాణ వార్తలు, పీఎం కిసాన్ స్కీమ్, యూనిక్ ఐడీ, రైతులకు స్కీమ్స్" width="1200" height="800" /> 3)బెనిఫిషియరీ స్టేటస్ కొత్త పేజీలో ఓపెన్ అయ్యాక, మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్ లేదా నంబర్ ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోండి. 4)ఈ మూడు నంబర్ల ద్వారా మీ ఖాతాకు డబ్బు వచ్చిందో లేదో చెక్ చేసుకోవచ్చు. 5)మీరు ఎంచుకున్న ఎంపిక సంఖ్యను నమోదు చేయండి. 6)ఆ తర్వాత గెట్ డేటాపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మొత్తం లావాదేవీ సమాచారాన్ని పొందుతారు.మీ ఈ-కేవైసీ స్టేటస్ లో ఎఫ్‌టీవో రూపొందించబడింది  అని ఉంటే గనుక చెల్లింపు నిర్ధారణ పెండింగ్‌లో ఉందని అనకథం. మీ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం ముగిసిందని భవించాలి. రైతుల సౌకర్యార్థం పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందుబాటులో ఉంది. ఈ పథకానికి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చు. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261 మరియు 011-24300606. కాల్‌ చేయవచ్చు.రైతు కుటుంబంలో ఎవరైనా ఆదాయపన్ను (ఐటీ) చెల్లింపుదారులుంటే వారికి పీఎం కిసాన్ పథకం వర్తించదు. అలాగే సాగు భూమి లేని వారిని కూడా పీఎం కిసాన్ యోజన నుంచి మినహాయించారు.(ప్రతీకాత్మక చిత్రం)ఆధార్ నెంబర్ లింకింగ్, పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్, పీఎం కిసాన్ యోజన పథకం, పీఎం కిసాన్ స్టేటస్ చెక్ ఆధార్ కార్డు" width="1600" height="1600" /> తాత లేదా తండ్రి పేరు మీద లేదా ఇతర కుటుంబ సభ్యుల పేరు మీద వ్యవసాయ భూమి ఉన్నప్పుడు కూడా రైతులు పీఎం కిసాన్ ద్వారా ప్రయోజనం పొందలేరు. భూమి యజమాని ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికిది వర్తించదు. రిజిస్టర్డ్ డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సీఏలు కూడా పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. ఒక రైతు సంవత్సరానికి రూ. 10,000 పెన్షన్ పొందినట్లయితే, వారు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. నిబంధనలను అతిక్రమించి పీఎం కిసాన్ సాయం పొందుతున్నట్లు తేలితే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం

Related Posts