YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రారంభమైన రామాయణ్ రైలు

ప్రారంభమైన రామాయణ్ రైలు

న్యూఢిల్లీ, జూన్ 23,
శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ భారత్‌ గౌరవ్‌ పర్యాటక రైలు ప్రారంభమైంది. శ్రీరామాయణ యాత్ర పేరిట స్టార్ట్‌ చేసిన ఈ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి  ప్రారంభించారు. భారత్‌-నేపాల్‌ మధ్య నడిచే మొట్ట మొదటి పర్యాటక రైలు ఇది. శ్రీరాముడు జన్మించిన ప్రాంతం నుంచి మొదలై, ఆయన జీవితానికి సంబంధించిన, నడయాడిన అనేక ముఖ్య ప్రాంతాలను కలుపుతూ ఈ ట్రైన్‌ను ప్రారంభించారు. 18రోజులపాటు సాగనున్న శ్రీ రామాయణ యాత్రా రైలు.. ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ రైల్వేస్టేషన్‌ నుంచి మొదలైంది. ఈ ట్రైన్‌.. అయోధ్య, బక్సర్‌, సీతామర్షి, జనక్‌పూర్‌, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, చిత్రకూట్‌, నాసిక్‌, హంపి, రామేశ్వరం, కాంచీపురం, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలు తిరుగుతూ తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.యాత్ర పొడవునా పర్యాటకులకు భోజనం, వసతి సదుపాయాలు, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, సెక్యూరిటీ, గైడ్స్‌.. లాంటి ఫెసిలిటీస్‌ కల్పించారు. ఈ రైలులో మొత్తం 14 కోచ్‌లు ఉండగా, 6వందల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. అయితే, ఢిల్లీ నుంచి స్టార్ట్‌ అయిన తొలి ప్రయాణంలో 5వందల మంది యాత్రికులు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. ఈ ట్రైన్‌లో కోచ్‌లన్నీ ఏసీ-త్రీ టైర్‌ సౌకర్యంతో నిర్మించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా రైలును తీర్చిదిద్దారు. పురాతన కట్టాలు, ఆలయాలు, నృత్య రూపాలు, వంటకాలు, యుద్ధ కళలు, జానపద కళలు చిత్రాలతో ట్రైన్‌ను సుందరంగా తీర్చిదిద్దారు.దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా భారత్‌ గౌరవ్‌ రైళ్లను తీసుకొస్తున్నారు. ఈ స్కీమ్‌ కింద 3500 కోచ్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. చారిత్రక, సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్రిక ప్రాంతాలను కలుపుతూ ఈ రైళ్లను నడుపనున్నారు.

Related Posts