YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అక్రమాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం

అక్రమాలపై హెచ్‌ఎండీఏ ఉక్కుపాదం

హైద్రాబాద్, జూన్ 23,
అక్రమాలపై హెచ్‌ఎండీఏ మరోసారి దృష్టి సారించింది. డిసెంబర్‌లో స్పెషల్‌డ్రైవ్ చేపట్టి ఉల్లంఘనుల్లో వణుకు పుట్టించిన హెచ్‌ఎండీఏ తాత్కాలిక విరామం తరువాత చర్యలకు మరోసారి సిద్ధమవుతోంది.అనధికారిక లే అవుట్లు, భవనాలపై హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ కన్నెర్రజేసింది. గతేడాది డిసెంబర్ నెలలో స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టి వందలాది నిర్మాణాలను నేలమట్టం చేసి అక్రమార్కుల వెన్నులో వణుకుపుట్టిన అధికారులు మళ్లీ కూల్చివేతలపై దృష్టి సారించారు. కూల్చి వేతల ప్రక్రియకు తాత్కాలికంగా విరామం ప్రకటించడంతో ఇటీవల కా లంలో అక్రమార్కులు రెచ్చిపోతూ ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో మేడ్చల్, శంకర్‌పల్లి, శామీర్‌పేట, ఘట్‌కేసర్ జోన్ల పరిధిలో అనధికారికంగా వెలసిన నిర్మాణాలపై ఆరా తీశారు. ఈ మేరకు 100 నిర్మాణాలు అక్రమంగా పుట్టుకొచ్చినట్లు గుర్తించి వాటికి ప్లానింగ్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వట్టి నాగులపల్లి, శంషాబాద్, కొంపల్లి ప్రాంతాల్లో పలు నిర్మాణాలపై చర్యలు చేపట్టిన అధికారులు నాగారం, బోడుప్పల్, దేవరయాంజల్ అక్రమాల నిర్మాణాలపై నేడో, రేపో చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, మేడ్చల్, మెదక్, నల్గొండ జిల్లాల పరిధిలోని దాదాపు 70 మండలాలు సుమారు 1032 గ్రామాల్లో 7257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నగరానికి చుట్టూ పక్కల ఉన్న పంచాయతీలు, మండ లాల్లో స్థిరాస్తి వ్యాపారం పేరుతో చాలా సంస్థలు అక్రమ లే అవుట్లు వేసి సామాన్యులకు బురిడీ కొట్టిస్తున్నాయి. వాస్తవంగా హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న పంచాయతీ భూముల్లో లే అవుట్లు వేయాలంటే తప్పనిసరిగా హెచ్ ఎండీఏ లేదా డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) నుంచి లే అవుట్ అనుమతులు తీసుకోవాలి. లే అవుట్‌కు అనుమతులకు సంబం ధించిన పలు నిబంధనలు పాటించాలి. లే అవుట్ చేసే నిర్మాణ రంగదారులు జీవో 288, 33ల ప్రకారం మొత్తం భూమిలో 30 శాతం అంతర్గత రహ దారుల కోసం కేటాయించాలి. మరో 10శాతం వరకు కనీస వసతులకు విడిచి పెట్టాల్సి ఉంటుంది.ప్లాట్లు వేసే ప్రాంతంలో 25శాతం హెచ్‌ఎండీఏ కనీసం మూడేళ్ల పాటు కుదువ పెట్టాలి. సంబంధిత లే అవు ట్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఆనంతరం హెచ్‌ఎండీఏ ఈ కుదువ పెట్టిన ప్లాట్లను రిలీజు చేస్తుంది. ఒకవేళ మధ్యలోనే సదరు రియల్టర్ చేతులె త్తేస్తే హెచ్‌ఎండీఏ రంగంలోకి దిగి ఈ 25 శాతం స్థలం విక్రయించి ఆ నిధులతో బాధితులను న్యాయం చేసే వీలు ఉంటుంది.

Related Posts