YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుల్దీప్ సింగ్ కు బిగిస్తున్న ఉచ్చు

కుల్దీప్ సింగ్ కు బిగిస్తున్న ఉచ్చు

 ఉన్నావ్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్పై తాజాగా మరో అభియోగాన్ని సీబీఐ నమోదు చేసింది. బాధితురాలి తండ్రిని తప్పుడు కేసులో ఇరికించేందుకు సెంగార్ ప్రయత్నించినట్టు కేసు నమోదైంది. అలాగే ఆయన మృతి కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు ఎస్ఐలను కూడా సీబీఐ గత బుధవారం అరెస్టు చేసింది. ముఖి పోలీస్ స్టేషన్ ఎస్ఐ అశోక్ సింగ్ భదౌరియా, కాంత ప్రసాద్ సింగ్లు బాధితురాలి తండ్రిపై తప్పుడు కేసు బనాయించి, పరోక్షంగా ఆయన మృతికి కారణమయ్యారు. అంతేకాదు అత్యాచార ఘటనలో ఆధారాలను మాయం చేసి, బాధితురాలి తండ్రిపై నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సీబీఐ వీరిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు ప్రస్తుతం సీతాపూర్ జైల్లో ఉన్న నిందితుడిని విచారించేందుకు రెండు రోజుల కస్టడీకి సీబీఐ కోరిందిమైనర్ బాలిక తండ్రి లాకప్డెత్ కేసులోనూ సెంగార్ను నిందితుడిగా పేర్కొన్నారు. సెంగార్ సోదరుడితోపాటు ఆయన అనుచరులు బాధితురాలి తండ్రిపై దాడికి పాల్పడినట్టు అభియోగాలు నమోదయ్యాయి. అతడిపై తప్పుడు కేసు బనాయించి, అరెస్టు చేయించడమే కాకుండా, విచారణ పేరుతో హింసంచడంతో కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయాడు. అతడికి బలమైన గాయాలు తగలడం వల్లే మృతిచెందినట్టు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. ఉద్యోగం కోసం 2017 జూన్ 4న బీజేపీ ఎమ్మెల్యే సెంగార్ ఇంటికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అప్పటి నుంచి న్యాయం కోసం బాధితురాలు పోరాటం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి తండ్రిపై ఎమ్మెల్యే అనుచరులు పలుమార్లు దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్ 3న బాధితురాలి తండ్రిపై అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ పేరుతో ఏప్రిల్ 5 న అరెస్టు చేశారు. అదే రోజు రాత్రి ఆయన ఓ ఆస్పత్రిలో మృతి చెందారు. 

Related Posts