YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాల్వాయి స్రవంతికి అంత ఈజీకాదా

పాల్వాయి స్రవంతికి అంత ఈజీకాదా

నల్గొండ, సెప్టెంబర్ 13, 
కాంగ్రెస్‌ లో గెలుపోటముల కంటే పార్టీలో ఆధిపత్యమే కీలకమని భావిస్తారు..ఇప్పుడు మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో ఉన్నారు.అయితే ఆమె అభ్యర్థిత్వాన్ని ఫైనల్‌ చేయాలని పట్టుబట్టిందెవరు?టిక్కెట్‌ ఇప్పించిన వాళ్లు గెలుపుకోసం కూడా పనిచేస్తారా?అసలు మునుగోడు ఫలితం కాంగ్రెస్‌ లో ఎవరి ఎకౌంట్‌ లో పడనుంది?వీటిచుట్టూ పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట.తెలంగాణ కాంగ్రెస్ తీరేవేరు..ఏ పార్టీలో అయినా ఎత్తులు పై ఎత్తులు ఎదుటి పార్టీ మీద ఉంటాయి.ఇక్కడ మాత్రం సొంత పార్టీ నేతల చుట్టూ తిరుగుతుంటాయి.ప్రత్యర్థులను ఎదుర్కోవటం కంటే, సొంతపార్టీలో నాయకుల్ని ఎదుర్కోవటమే చాలా సార్లు పెద్ద టాస్క్‌ లా మారుతుంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ తీరు మరోసారి బయటపడింది.పార్టీలో ఓ ఎంపీ, పాల్వాయి స్రవంతికి టికెట్ ఇస్తే అన్నీ తానై నడిపిస్తా అన్నారట.దీనికి తోడు జిల్లాకు చెందిన నాయకులు కూడా… పాల్వాయి స్రవంతికి ఇవ్వండి అని సూచన చేశారట.కానీ, సూచన చేసిన నాయకులెవరూ మునుగోడు కి వెళ్లి ప్రచారం చేయటంలేదు..ఎన్నికల కసరత్తు కోసం జరిగే మీటింగ్ లకు కూడా వెళ్ళలేదు.ఉపఎన్నికల్లో అభ్యర్ధి ఎంపిక అనేదే కీలకం.హుజూరాబాద్ లో కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడంతోనే, పార్టీ కోసం క్యాడర్ పని చేయలేదనే చర్చ తెర మీదకు తెచ్చారు కొందరు సీనియర్లు. ఇప్పుడు మునుగోడులో కూడా ఆర్ధిక బలం అవసరం లేదు… పాల్వాయి కుటుంబానికి టికెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. అప్పుడే క్యాడర్ పని చేస్తుందని అధిష్టానానికి చెప్పారట. దీనికి తోడు చలమల కృష్ణారెడ్డిని రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నడనే కారణం కూడా ఆయన్ని పక్కన పెట్టడానికి కారణమైందనే ప్రచారం నడుస్తోంది. మునుగోడులో ఎన్నికలను ఎదుర్కోవడం కంటే, నాయకుల మధ్య ఉన్న అంతర్గత పంచాయతీలో ఆధిపత్యం కోసమే ఎక్కువ ప్రయత్నం జరిగిందనే టాక్ ఉంది. ఈ పరిణామాల తర్వాత, రేవంత్ తనను నమ్ముకున్న వాళ్లకు టికెట్ ఇప్పించలేక పోయారనే ఫీలర్ ఒకటి బయటకు వచ్చింది.పాల్వాయి గోవర్దన్ రెడ్డి కుటుంబం నుండి స్రవంతి కి టికెట్ ఇప్పించిన సీనియర్ నేతలు, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? ఎన్నికల ఆర్ధిక అంశాలు ఎవరు చూస్తారు? టియ్యారెస్‌, బీజేపీలను ఎదుర్కొరే స్థాయిలో బలంగా ఎవరు నిలబడతారనేదానిమీదనే ఇప్పుడు కాంగ్రెస్‌ లో చర్చ నడుస్తోంది. అభ్యర్ధి ఎంపిక ఎలా ఉన్నా… ఎన్నికల వ్యవహారంలో బాధ్యత పిసిసి చీఫ్ మీదనే ఉంటుంది. ఫలితాలు అనుకూలంగా వస్తే సీనియర్స్ కోటాలో, తేడాగా వస్తే, రేవంత్ మీద నెట్టేలా కాంగ్రెస్ లో ఓ వర్గం ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయంలో రేవంత్‌ టీం ఉంది.ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ కి మునుగోడు ఎన్నిక కచ్చితంగా ఓ సవాల్‌ గా మారిందనే చెప్పాలి.ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో రేవంత్‌ పై మండిపడుతున్న నేతలు చాలామందే ఉన్నారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాహాటంగానే మాట్లాడుతున్నారు.హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపై రేవంత్ పై జగ్గారెడ్డి ఓ రేంజ్ లో విమర్శలు చేశారు.ఇప్పుడు మునుగోడు ఫలితాలు కూడా తేడా వస్తే, రేవంత్ నాయకత్వంపై ఫెయిల్యూర్ అనే ముద్రపడే అవకాశం లేకపోలేదు. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరులో… రేవంత్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.ఈ పరిణామాల మధ్య మునుగోడు ఎన్నికల కాంగ్రెస్‌ లో చాలా ప్రశ్నలకు కారణమైంది.మునుగోడు సవాల్ ని రేవంత్ ఎలా ఎదుర్కొంటారుఅభ్యర్ధి ఎంపికలో చక్రం తిప్పిన నాయకులు ప్రచారం లో పాల్గొంటారా?రేవంత్ వ్యతిరేక టీం… అప్పుడే వ్యూహం మొదలు పెట్టిందా..?వీటి నుండి రేవంత్ ఎలా బయట పడతారుఅసలీ ఆధిపత్య పోరు పార్టీని ఎటు తీసుకెళుతుంది అనే చర్చ పార్టీ కేడర్‌ లో నడుస్తోందట

Related Posts