
కుత్బుల్లాపూర్
మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ దాడులు బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. దాడుల్లో 65 బృందాలుగా దాదాపు 400 కి పైగా అదికారులు పాల్గోన్నారు. సీఆర్పిఎఫ్ బలగాల భారీ బందోబస్తు లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి బంధువులు, స్నేహితుల ఇండ్లలో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం స్వాదీనం చేసుకున్నట్లు సమాచారం.
దాడుల నడుమ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్దతకు గురయ్యారు. అయనకు ఛాతిలో నొప్పి రావడంతో సూరారం లో ని హాస్పటల్ కు తరలించారు. తన కొడుకును చూడడానికి హాస్పిటల్ కి మంత్రి మల్లారెడ్డి వెళ్లారు. మంత్రితో పాటు ఐటీ అధికారులు కుడా ఆసుపత్రికి వెళ్లారు.
మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజకీయ కక్ష్యతో నాపై నా బంధువుల పై ఐటీ రైడ్స్ చేయిస్తుంది. నా కొడుకు ను ఐటీ రైడ్స్ పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వేధించారు. నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు.. అందుకే ఆసుపత్రి పాలయ్యాడని అన్నారు. ఎలాంటి దొంగ వ్యాపారాలు చేయట్లేదు.. క్యాసినో లు నడిపించట్లేదు. కావాలని నాపై ఐటీ దాడులు చేస్తున్నారు. 200 మంది ఐటీ అధికారులతో మాపై దాడులు చేయించి భయపెడతారా? నా కొడుకుని చూద్దాం అంటే కూడా లోపలికి వెళ్ళనివ్వడం లేదు.. చుట్టూ.. అధికారులు, పఅర్పిఎఫ్ పోలీసులను పెట్టారు. నా కొడుకు ఇప్పటికే భయంతో వణికిపోతున్నాడు. నిన్న నా కొడుకుని కొట్టారని ఆరోపించారు.