YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మంచుకొండల్లో కాంగ్రెస్

మంచుకొండల్లో కాంగ్రెస్

సిమ్లా, డిసెంబర్ 9, 
దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) విడుదలయ్యాయి. ఊహించిన దాని కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించిన బీజేపీ.. ప్రభంజనం సృష్టిస్తే హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం పట్టుతప్పింది. గుజరాత్ లో బీజేపీ ప్రభంజనానికి ఆప్, కాంగ్రెస్ లు చతికిలపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కైవసం చేసుకోవడం ఒక్కటే కాంగ్రెస్ కు అనుకూలించే విషయం. ప్రతి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మారుస్తూ వస్తున్న హిమాచల్ ఓటర్లు ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లకు గానూ 40 సీట్లను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. మిగిలిన మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేక పోయింది.అయితే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కేవలం 0.9శాతం మాత్రం ఓటింగ్ పర్సెంటేజ్ తేడా ఉంది. కాంగ్రెస్‌కు 43.91శాతం మంది ఓట్లేస్తే.. బీజేపీకి 43 శాతం మంది ఓటేశారు. ఆప్‌కి 1.10శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటమిని అంగీకరించిన హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు అందించారు. రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తానన్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజల హామీలను నెరవేర్చాలని.. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామన్నారు.హిమాచల్ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలియజేశారు. అంకిత భావంతో కార్యకర్తలు, నాయకులదే ఈ విజయమన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సాధ్యమైనంత త్వరలో నెరవేరుస్తామన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్టీ గెలుపునకు కారణమైందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న ప్రియాంకా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని అందించినందుకు ప్రజలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసింది కాంగ్రెస్ పార్టీ.ఇక సీఎం రేసులో ఎంపీ ప్రతిభాసింగ్ ముందంజలో ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ భార్యే ఈ ప్రతిభా సింగ్. ఇప్పుడు ఆమెను సీఎంగా ఖరారు చేయవచ్చనే అభిప్రాయాలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది

Related Posts