YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

హస్తినకు క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు

హస్తినకు క్యూ కట్టిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్, డిసెంబర్ 9, 
తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు ఢిల్లీలోనే రౌండ్లు వేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలని పక్కన పెట్టి..పార్టీలో పదవుల పంపకాలపై రాజకీయం చేస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోయిన దగ్గర నుంచి కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. ఇక మిగతా నేతలు కూడా ఢిల్లీ చుట్టూనే తిరుగుతున్నారు. పార్టీలో కీలక మార్పులు చేయడంలో భాగంగానే హస్తం నేతలంతా హస్తినలో మకాం వేశారు. పి‌సి‌సి వర్కింగ్ ప్రెసిడెంట్లు, జిల్లా అధ్యక్షుల మార్పు విషయంపై చర్చలు నడుస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే రేవంత్ తో పాటు ఉత్తమ్, భట్టి, మధుయాష్కి, జగ్గారెడ్డి, వి‌హెచ్, దామోదర రాజనరసింహ, గీతారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మహేశ్ గౌడ్…ఇలా పెద్ద నాయకులు మొత్తం ఢిల్లీ టూర్ లోనే ఉన్నారు. అటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం హస్తినలోనే ఉన్నారని తెలిసింది. ఆయన కూడా ఏ‌ఐ‌సి‌సి నేతలని కలుస్తున్నట్లు సమాచారం. అయితే ఇలా కీలక నేతలు హస్తినలో ఉంటూ..పదవుల పంపకాలపై చర్చలు చేసున్నారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గానికి కీలక పదవులు రాకుండా చేయాలని సీనియర్ నేతలు ట్రై చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి ఏమో తన వర్గానికి ప్రాధాన్యత దక్కేలా చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా ఎవరికి వారు పదవులపైనే ఫోకస్ పెట్టారు..తప్ప రాష్ట్రంలో పరిస్తితులు ఎలా ఉన్నాయి. అక్కడ పార్టీని బలోపేతం చేద్దామనే అంశాలని పట్టించుకోవడం లేదు.ఓ వైపు టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ గట్టిగా నడుస్తోంది..మరోవైపు షర్మిల సైతం దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కానీ బలం ఉన్న కాంగ్రెస్ మాత్రం సొంత వ్యవహారాల్లోనే ఉంది. దీని వల్ల పార్టీకి నష్టమే తప్ప..పావలా లాభం కలిగేలా లేదు. ఈ ఢిల్లీ చుట్టూ తిరగడం మానేసి..రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తే బెటర్. లేదంటే ఇంకా రాను రాను కాంగ్రెస్ గడ్డు పరిస్తితులు ఎదురుకోవాలి.

Related Posts