YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

క్రెమ్లిన్‌ దాడిలో పూర్తిగా ధ్వంసమవుతోన్న ఉక్రెయిన్‌

క్రెమ్లిన్‌ దాడిలో పూర్తిగా ధ్వంసమవుతోన్న ఉక్రెయిన్‌

న్యూ డిల్లీ డిసెంబర్ 16
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. క్రెమ్లిన్‌ దాడిలో ఉక్రెయిన్‌ పూర్తిగా ధ్వంసమవుతోంది. రష్యాను నిలువరించేందుకు అక్కడి సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంపై ఉక్రెయిన్ కమాండ్ ఇన్ చీఫ్ జనరల్ వలేరీ జాలుజ్నీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 తొలి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడే అవకాశం ఉందని అన్నారు. ఇటీవల బ్రిటీష్ వీక్లీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో రష్యా భీకర దాడులకు పాల్పడొచ్చు. జనవరి చివర్లో దాడులు మొదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్యా దాడులను తగ్గించడం కూడా యుద్ధ వ్యూహంలో భాగమే. ఈ గ్యాప్‌లో తమ సైనిక బలగాలను పెంచుకోవడం ద్వారా మళ్లీ యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది. యుద్ధానికి సంబంధించి ఇది చాలా వ్యూహాత్మక నిర్ణయం. ప్రస్తుతం రష్యా రెండు లక్షల మంది సైనికులను సిద్ధం చేసుకుంటోంది. రాజధాని కీవ్‌పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడతాయనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు.అయితే ప్రస్తుతం తమ ముందున్న ప్రధాన లక్ష్యం ఫ్రంట్‌లైన్‌ ను కాపాడుకోవడమే అని వలేరీ జాలుజ్నీ అన్నారు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని అందుకు పూర్తి సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. రష్యా మరోసారి విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్ని ట్యాంకులు, ఆయుధాలు, సైనికులు కావాలనే విషయంలో తాము కూడా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ‘మా భూభాగాన్ని కొంత కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. యుద్ధంలో మా శత్రువును జయిస్తామనే నమ్మకం మాకు ఉంది. అయితే మాకు యుద్ధ వనరులు చాలా అవసరం. 300 యుద్ధ ట్యాంకులు, 600 నుంచి 700 వరకు ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికిల్స్ 500 హోవిట్జర్‌లు అవసరం’ అని అన్నారు.

Related Posts