YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఖద్దరు లీడర్లు ఆక్రమణల కథ

ఖద్దరు లీడర్లు ఆక్రమణల కథ

హైదరాబాద్, జనవరి 23, 
చాలా కాలంగా ఆ భూమి చుట్టూ ప్రభుత్వ భూములు అని బోర్డులు, చుట్టూ ఫెన్సింగ్ ఉండేది. స్థానిక గ్రామస్తులు భూమిని కాపాడుతూ వస్తున్నారు. ఉన్న ఫలంగా బోర్డులు, ఫెన్సింగ్ మాయమైంది. అందులో నిర్మాణాలు మొదలయ్యాయి. ఇదేమి దౌర్జ్యనం అంటూ గ్రామస్తులు ఆగ్రహించారు. కొందరు ఖద్దరు లీడర్లు ఈ ఆక్రమ కథ నడిపించారు. ఈ భూమికి తమకు చెందినదేనని, ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చిందని ప్రోసిడింగ్ కాపీలు ఇచ్చారు. రెవెన్యూ అధికారులు ఏలా ప్రొసిడింగ్స్ ఇచ్చారని ఆశ్చర్యపోయారు.ముత్తంగిలోని 521సర్వే నెంబర్‌లో భూదాన్ భూమి ఉంది. భూమి భూదాన్ పరిధిలో ఉందని స్థానికులందరికీ తెలుసు. దాదాపు 3 ఎకరాల చుట్టూ అధికారులు గతంలో బోర్డులు పెట్టింది, పెన్సింగ్ వేయించారు. దాదాపు 15 ఏళ్లుగా ఈ భూమిలో గ్రామానికి సంబంధించి టీటీడీకి సంబంధించిన ఓ ఫంక్షన్ హాలు నిర్మించాలనే ప్రయత్నాలు జరిగాయి. భూదాన్ బోర్డు భూమి కావడంతో ఇబ్బందులు ఏర్పడి విరమించుకున్నారు. గ్రామానికి చెందిన పెద్దలంతా భూదాన్ భూమిని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఈ భూమి ఉండడంతో కోట్లు విలువ పలుకుతుంది. భూమిపై చాలా మంది కన్నపడినప్పటికీ గ్రామస్తులు ఐక్యంగా ఉండడంతో భూమి జోలికి ఎవరు రాలేకపోయారు.ప్రభుత్వ భూముల కబ్జా, ఆక్రమణ, చెరువు,కుంటల్లో నిర్మాణాలకు పటాన్ చెరు నియోజకవర్గం కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోనే ఇక్కడ జరుగుతున్న కబ్జాల వ్యవహారం మరెక్కడా ఉండదని చెప్పుకోవచ్చు. అధికారులతో కుమ్మక్కవుతున్న లీడర్లు పథకం ప్రకారం ఏదో పత్రాలు సృష్టించి భూములు కబ్జా చేస్తున్నారు. ఇందులో భాగంగానే పటాన్ చెరుకు చెందిన కొందరు నాయకులు ఈ భూమిపై కన్నెశారు. వారికి సహకరించే కొందరు అధికారుల సూచనలు, సలహాలతో భూదాన్ భూమి ఆక్రమణకు పథక రచన చేశారు. రూ.50 కోట్ల విలువ చేసే భూమిని ఆక్రమించుకుని వాటాలు వేసుకోవాలని ఆ లీడర్లు నిర్ణయించుకున్నారు. ఈ భూమి కబ్జాకు గురికాకుండా చూస్తున్నవారితో కొంత చర్చలు కూడా జరిపినట్లు ప్రచారం జరుగుతుంది.భూదాన్ భూమి ఆక్రమణకు పక్కా ప్లాన్ వేసిన లీడర్లు మొదట ప్రైవేట్ భూమిగా అధికారులు దృవీకరించారని స్థానికంగా ప్రచారం చేశారు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్టేషన్(సీసీఎల్ఏ) పేరుతో ఓ ఫేక్ ఆర్డర్ కాపీ సృష్టించారు. ఆ కాపీని రెవెన్యూ అధికారులకు అందించారు. ముత్తంగిలోని 521 సర్వేనెంబర్‌లోని భూమి భూదాన్ బోర్డుకు సంబంధించినది కాదని దృవీకరిస్తూ సీసీఎల్ఏ పత్రాలు వచ్చాయని విస్ర్తతంగా ప్రచారం చేశారు.జిల్లా రెవెన్యూ అధికారులతో పాటు పటాన్ చెరు రెవెన్యూ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఎవరికి తెలియకుండా భూమి కాజేయాలని అందరూ కలిసి పక్కా ప్లాన్ వేశారు. కింది స్థాయి నుంచి చకచక ఫైళ్లు కదిలాయి. ఉన్నతాదికారులు కనీస విచారణ జరపకుండానే భూదాన్ భూమి ప్రైవేట్ వ్యక్తులదేనంటూ ప్రొసిడింగ్స్ జారీ చేశారు. భూమి తమకు వచ్చిందని సదరు లీడర్లు ఈ ఆదేశ పత్రాలను గ్రామస్తులకు, ఎవరు ప్రశ్నిస్తే వారికి పంపించారు. కోర్టులు తేల్చాశాయి...సీసీఎల్ఏ ఆదేశాలిచ్చింది...ఈ భూమి తమదేనంటూ ఆక్రమించుకున్నారు.నకలీ పత్రాలు సృష్టించి భూమికి ప్రొసిడింగ్స్ సాధించుకున్న అక్రమార్కులు వెంటనే భూదాన్ భూమిలో పొజీషన్ కు వెళ్లారు. ప్రభుత్వ బోర్డులను పీకిపడేశారు. పెన్సింగ్ తొలగించారు. వెంచర్ ఏర్పాటు కోసం రోడ్ల నిర్మాణం మొదలు పెట్టారు. వాహనాలు మట్టిని తరలించడం, రోడ్ల పనులు ప్రారంభం కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారికి ప్రొసిడింగ్స్ చూపించారు. దీనితో అందరూ మౌనం వహించారు. ఇక భూమి తమ ఆదీనం అయ్యిందని కబ్జా చేసిన లీడర్లు ఎగిరిగెంతులేశారు. ప్రశ్నించిన వారిని బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతుంది.ఏళ్లుగా భూదాన్ పరిదిలో ఉన్న భూమి ప్రైవేట్ వాళ్లకి చెందినదిగా సీసీఎల్ఏ దృవీకరించడంపై కలెక్టర్ కు కొంత అనుమానం కలిగింది. జిల్లాపై అందులో పటాన్ చెరు భూములపై అవగాహన ఉండడంతో కలెక్టర్ సీసీఎల్ లోని అధికారులను సంప్రదించారు. ముత్తంగిలోని 521 సర్వేనెంబర్ కు సంబంధించి ఇక్కడి నుంచి ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీనితో ఫేక్ పత్రాలు సృష్టించి భూదాన్ భూమిని ఆక్రమించుకున్నట్లు కలెక్టర్ శరత్ గుర్తించారు. అదనపు కలెక్టర్, ఆర్డీవో, పటాన్ చెరు తహసిల్దార్లను అప్పటికప్పుడు పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఎల్ఏ పత్రాలను కనీస విచారణ చేయకుండా ప్రొసిండింగ్స్ ఇవ్వడాన్ని సీరియస్ గా తీసుకున్నారు.వెంటనే ప్రొసిడింగ్స్ ను రద్దు చేశారు. అంతే కుకుండా భూదాన్ భూమి ఆక్రమణ కథ నడిపిన అక్రమార్కులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కేసుపై స్పష్టమైన విచారణకు ఆదేశించినట్లు కలెక్టర్ శరత్ 'దిశ' ప్రతినిధితో చెప్పారు. ప్రభుత్వ భూముల జోలికి వస్తే ఊరుకోబోమని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో భూమి చుట్టూ తిరిగి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మొత్తంగా రూ.50 కోట్లు భూమి ఆక్రమణకు గురై..తిరిగి మళ్లీ సర్కారు ఆధీనంలోకి వచ్చింది.

Related Posts