YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ ఫస్ట్ కి వచ్చేసినా టాటా

మళ్లీ ఫస్ట్ కి వచ్చేసినా టాటా

ముంబై,  మార్చి 14, 
దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో టాటా గ్రూప్‌ కంపెనీ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా అదానీ గ్రూప్‌ స్టాక్స్‌ భారీ నష్టాలు చవిచూడటంతో ఒక్కసారిగా దాని మార్కెట్‌ విలువ మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా హిండర్‌ బర్గ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. టాటా గ్రూప్  మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. దేశంలోనే రెండు అతిపెద్ద వ్యాపార సంస్థలైన టాటా, రిలయన్స్ జనవరి 25 నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో వరుసగా 2%, 4% నష్టపోగా, అదానీ ఏకంగా 51శాతం నష్టాలకు చవిచూసింది. మార్చి 10 నాటికి టాటా గ్రూప్ మార్కెట్ విలువ రూ. 21.1 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 16 లక్షల కోట్లు ఉండగా.. అదానీ గ్రూప్‌ కంపెనీ విలువ రూ. 9.29 లక్షల కోట్లకు క్షీణించింది.ఈ నేపథ్యంలో టాటా గ్రూప్‌ అగ్రస్థానానికి చేరుకోగా అదానీ గ్రూప్‌ మూడో స్థానానికి పరిమితమైంది. 2022 ఆర్థిక సంవత్సరంలో అదానీ గ్రూప్ కంపెనీలు మొత్తంగా 38% ఆదాయాన్ని సాధించగా, టాటాకు 25%, రిలయన్స్‌45% శాతం లాభాలను చవిచూశాయి. గతేడాది అంబుజా సిమెంట్స్, ఏసీసీని కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్‌ వెనక్కినెట్టి అదానీ గ్రూప్‌ కంపెనీ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఐతే వరుస నష్టాల కారణంగా అదాని గ్రూప్ ప్రస్తుతం మూడో స్థానానికి పరిమితమైంది.

Related Posts