YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మితిమీరుతున్న లోన్ యాప్ ఆగడాలు

మితిమీరుతున్న లోన్ యాప్ ఆగడాలు

రాజమండ్రి, మే 30, 
ఆన్ లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు లోన్ యాప్ లను సంప్రదించి అప్పు తీసుకున్న వారినే వేధించిన సంఘటనలు చూశాం. కానీ తూర్పు గోదావరి జిల్లా కడియంలో సరికొత్త లోన్ యాప్ వేధింపుల ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... కడియం మండలంలో నివాసం ఉండే దేవి అనే మహిళ నిన్న దిశా ఎస్ఓఎస్ కు కాల్ చేసి తనను లోన్ యాప్ నిర్వాహకుడు వేధిస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఇంటికి వెళ్లిన దిశ పోలీసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని రోజుల కిందట గుర్తు తెలియని నెంబర్ నుండి తనకు 2000 రూపాయలు ఫోన్ పే ద్వారా వచ్చాయని.. అది గమనించి వెంటనే అదే నెంబర్ కు అమౌంట్ తిరిగి పంపించినట్లు తెలిపారు.అప్పటి నుండి అదే నెంబర్ నుండి వాట్సాప్ కాల్ చేసిన వ్యక్తి హిందీ, ఇంగ్లీషులో మాట్లాడుతూ వేధింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయారు. అదనంగా డబ్బులు చెల్లించాలని లేదంటే తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బాధితురాలిని బెదిరించాడు. ఆగంతకుడు చెప్పిన విధంగానే బాధితురాలి ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటోలను పంపించడం మొదలు పెట్టాడు. ఆగంతకుడి ఆకృత్యాలు శృతిమించడంతో బాధితురాలు దిశా పోలీసులకు కాల్ చేసి సమాచారం ఇచ్చారు.బాధితురాలు దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిశా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగంతకుడు కాల్ చేసిన ఫోన్ నెంబర్, ఇతర వివరాల ఆధారంగా కడియం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వేధింపులకు పాల్పడితే వెంటనే దిశ ఎస్ఓఎస్ కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు.ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతి పెద్ద ఫేక్ లోన్ యాప్స్ ముఠా ఆట కట్టించారు. ముగ్గురు విదేశీయుల్ని కూడా అరెస్ట్ చేశారు. లోన్ , గేమింగ్ యాప్స్ పేరుతో కస్టమర్లను ఆకర్షించి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు  చేస్తున్నారు. మొత్తం ఎనిమిది దేశాల్లో వీరి నేర సామ్రాజ్యం విస్తరించి ఉందని పోలీసులు చెబుతున్నారు. తూ.గో జిల్లా కడియం పోలీస్ స్టేషన్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులకు సంచలన విషయాలు తెలిశాయి. మలేషియాలో ఉంటూ.. అక్కడ్నుంచే .. ఇండియాలో ఏజెంట్లను పెట్టుకుని ఫేక్ లోన్ యాప్స్ ను నడుపుతున్నారు. ఈ లోన్ యాప్స్ ద్వారా ఎవరైనా ఓ పదివేల రూపాయల రుణం తీసుకుంటే వారిని ఈ ముఠా పీల్చిపిప్పి చేస్తుంది. పది వేలకు రూ . లక్ష కట్టినా ఒప్పుకోరు. మార్ఫింగ్ ఫోటోలు.. ఇతర పద్దతుల ద్వారా బ్లాక్ మెయిల్ చేసి ఎంత కడితే అంత కట్టించుకుంటూనే ఉంటారు. కడియం పోలీసులు దర్యాప్తు చేసిన కేసులో బాధితుడు మే ఐదో  తేదన ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి లోన్ యాప్స్ నిర్వాహకులు, ఏజెంట్ల వేధింపులే కారణం. నిందితుల్ని పట్టుకున్న తర్వాత వారి బ్యాంకు లావాదేవీల్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కనీసం కోటి రూపాయల మేరకు రోజుకూ లావాదేవీలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక మంది వీరి బాధితులు ఉన్నట్లుగా గుర్తించారు.

Related Posts