YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆకట్టుకున్న రామ్ సీతా సాంగ్

ఆకట్టుకున్న రామ్ సీతా సాంగ్

హైదరాబాద్, మే 30, 
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆదిపురుష్' కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రామాయణం ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ సాయంతో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో శ్రీరాముడిగా ప్రభాస్ కనిపించనున్నారు. ఆయన సతీమణి సీతాదేవిగా బాలీవుడ్ నటి కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త్ నాగే, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ అభిమానులు ఎంతో అద్భుతంగా అలరించింది.  ట్రైలర్లో రాముడిగా ప్రభాస్ లుక్స్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ అందరినీ ఆకట్టుకోవడంతో ట్రైలర్ ఒక్కసారిగా సినిమా పై అంచనాలను పెంచేసింది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు సినీ అభిమానులను అద్భుతంగా అలరించాయి. తాజాగా ఈ సినిమాలోని ‘రామ్ సీతా రామ్’  అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. రాఘవుడు, సీత మధ్య సంభాషణతో ప్రారంభమైన ఈ సుమనోహర గీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వీనుల విందుగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ఓ రేంజిలో వైరల్ గా మారింది. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అద్భుమైన విజువల్ వండర్ గా ఈ పాటను రూపొందించారు.ఇక ఈ సినిమా రామాయణం ఆధారంగా చేసుకుని రూపొందుతోంది. ఓం రౌత్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమాను రెట్రో ఫైల్స్, టి సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం పోస్టర్లు, పాటలు విడుదల చేస్తున్నారు.  వాస్తవానికి 'ఆది పురుష్' టీజర్ రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించినా.. సినిమా టీజర్ మాత్రం ఏదో కార్టూన్ సినిమా చూస్తున్నట్టే అనిపించిందని చాలా మంది ఆరోపించారు. అనుకున్న స్థాయిలో గ్రాఫిక్స్ కుదరకపోవడం, ఈ సమయంలోనే మూవీపై వివాదాస్పద కామెంట్లు రావడం 'ఆది పురుష్' రిలీజ్ పై తీవ్రంగా ప్రభావం చూపాయి. ‘ఆది పురుష్’ను మొదటగా సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించిన మేకర్స్.. సినిమాలోని గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శలను చూసి..  గ్రాఫిక్స్ పనులను మళ్లీ చేయించారు.  దీంతో ఈ సినిమా మరింత లేట్ అయింది. దీంతో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ భారీ చిత్రాన్ని జూన్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'ఆదిపురుష్' థియేట్రికల్ హక్కులను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 170 కోట్లకు ఈ రెండు రాష్ట్రాల రైట్స్ ను కొనుగోలు చేసింది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాను ఆ సంస్థ నిర్మిస్తున్నది. తెలుగులో జరిగిన భారీ థియేట్రికల్ రైట్స్ డీల్స్ చూస్తే... 'ఆర్ఆర్ఆర్' రెండు రాష్ట్రాల హక్కులు సుమారు రూ. 226 కోట్లకు విక్రయించారు. 'బాహుబలి 2' అయితే రూ. 120 కోట్లకు, 'సాహో' రూ. 124 కోట్లకు విక్రయించారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత స్థానం 'ఆదిపురుష్' దక్కించుకుంది.

Related Posts