YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైలు ప్రమాదంలో

రైలు ప్రమాదంలో

భువనేశ్వర్, జూన్ 3, 
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మృతి చెందగా, 900 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో రైలులో ఉన్న ప్రయాణికులు ఈ ప్రమాదం జరిగిన భయానక దృశ్యాన్ని వివరించారు.ప్రమాదం జరిగిన సమయంలో తాను నిద్రిస్తున్నానని ఓ ప్రయాణికుడు మీడియాకు తెలిపాడు. రైలు బోల్తా పడగానే ఒక్కసారిగా కళ్లు తెరిచి చూశాను. అప్పటికే నాపై 10-15 మంది పడి ఉన్నారు. వారి మధ్యలో నేను ఇరుక్కుపోయాని. నా చేతులు, కాళ్ళకు గాయాలు అయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా వారిని నెట్టుకొని బయటకు వచ్చాను. అక్కడ చూస్తే నాకు భయానక దృశ్యాలు కనిపించాయి. చాలా మంది శవాలపై పడి ఉన్నారు. ఒకరి చేతిని కోల్పోయి రోధిస్తున్‌నారు. మరొకరి కాలు పూర్తిగా చితికిపోయింది. తలచుకుంటే భయమేస్తోంది. "ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఇతర నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు నష్టపరిహారం ఇస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా తెలిపారు. అక్కడ 600-700 రెస్క్యూ బలగాలు పనిచేస్తున్నాయి. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతాయి. క్షతగాత్రులను రక్షించి వారికి చికిత్స అందించడమే మా ప్రాధాన్యత.హౌరా వెళ్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన పలు బోగీలు బహంగా బజార్ వద్ద పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన బోగీలు 12841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొనడంతో దాని బోగీలు కూడా బోల్తా పడ్డాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది.ప్రమాదం కారణంగా చాలా రైళ్లను రైల్వే శాఖ దారి మళ్లించింది. మరికొన్నింటిని రద్దు చేసింది.  ఆ రైళ్ల జాబితాను కూడా విడుదల చేసింది.
12 లక్షల పరిహారం
అధికారికంగా మృతుల సంఖ్యను అధికారులు ప్రకటించకపోయినా.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రగాయాలు లేదా వైకల్యం ఏర్పడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు.జరిగిన ప్రమాదంపై ఒడిషా సీఎస్ ప్రదీప్ జేనా స్పందించారు. ఘటనలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైనట్లు ప్రదీప్ జేనా స్పష్టం చేశారు. ఒఢిశా సీఎం నవీన్ పట్నాయక్ తో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఖరగ్ పూర్, చెన్నై, బాలాసోర్ లలో అత్యవసర సహాయక కేంద్రాలను రైల్వే ఏర్పాటు చేసింది. జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ ఖర్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ రాహుల్ గాంధీ తీవ్రదిగ్ఙ్రాంతి వ్యక్తం చేశారు.

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు :
ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం. ఈఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.ప్రమాదంపై సమీక్ష నిర్వహించిన జగన్... సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలోని అంబులెన్స్‌లను ఘటనా స్థలాని పంపించాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో సహకరించేందుకు ఆసుపత్రులను కూడా రెడీ చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో ఎంక్వయిరీ సెల్ ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. ఘటనా స్థలానికి నేరుగా వెళ్లి రాష్ట్రానికి చెందిన వారు ఉన్నా... ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి సహాయం కావాలని చేసేలా ఓ బృందాన్ని రెడీ చేశారు. మంత్రి అమర్‌నాథ్‌ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌లతో ఏ టీంను రెడీ చేశారు. వాళ్లు స్పాట్‌కు వెళ్లనున్నారు.  ఒడిశా రైలు ప్రమాదంపై వివరాలకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే. ప్రయాణికుల వివరాలు తెలుసుకునేందుకు  విజయవాడ,రాజమండ్రి లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు.
విజయవాడకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
Rly -67055
BSNL- 0866 2576924
రాజమండ్రికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్
BSNL: 08832420541
RLY: 65395
దక్షిణ మధ్య రైల్వే హెడ్‌ క్వార్టర్, సికింద్రాబాద్: 040 - 27788516
విజయవాడ : 0866-2576924
రాజమండ్రి : 0883-2420541
సామర్లకోట: 7780741268
ఏలూరు: 08812-232267
తాడేపల్లిగూడెం: 08818-226212
బాపట్ల: 08643-222178
తెనాలి: 08644-227
బాలాసోర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఒక రోజు సంతాప దినం పాటించాలని ఆదేశించారు. జూన్ 3న రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి వేడుకలు నిర్వహించరాదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో సంతాప దినం ప్రకటించింది. వేడుకలను నిషేధించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా ప్రధాని కార్యక్రమాలను కూడా మార్చేశారు. ముంబై-గోవాకు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ శనివారం జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంది. అది వాయిదా పడింది.ప్రమాదం తర్వాత రైల్వే శాఖ చాలా రైళ్లను దారి మళ్లించింది. ఆ పరిస్థితి లేని ట్రైన్స్‌ రద్దు చేసింది. అలాంటి రైళ్లా జాబితాను విడుదల చేసింది.
దారి మళ్లించిన రైళ్ల జాబితా ఇలా ఉంది.
రైలు నెంబర్ 22807 టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 22873 కూడా టాటా జంషెడ్ పూర్ మీదుగా వెళ్తుంది.
రైలు నెంబర్ 18409ను టాటా జంషెడ్ పూర్ వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 22817ను కూడా టాటా వైపు మళ్లించారు.
రైలు నెంబర్ 15929ను తిరిగి భద్రక్ కు పిలిపించారు.
12840 చెన్నై సెంట్రల్-హౌరా ప్రస్తుతం ఖరగ్ పూర్ డివిజన్ లోని జరోలి గుండా నడుస్తుంది.
18048 వాస్కోడిగామా - షాలిమార్ కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా దారి మళ్లించబడింది.
సికింద్రాబాద్-షాలిమార్ (22850) వీక్లీ రైళ్లను కటక్, సల్గావ్, అంగుల్ మీదుగా మళ్లిస్తారు.

ఇప్పటి వరకు జరగిన ఘోర రైలు ప్రమాదాలు :
ఒడిశాలోని బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది ప్రాణాలు కోల్పోగా, 900 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తర్వాత ఒకే చోట మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ప్రమాదంపై విచారం వ్యక్తం చేయడంతో పాటు నష్టపరిహారం కూడా ప్రభుత్వం ప్రకటించింది. హౌరా వెళ్తున్న 12864 బెంగళూరు-హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు చెందిన పలు బోగీలు బహంగా బజార్ వద్ద పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన ఈ బోగీలు 12841 షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్నాయని, దాని బోగీలు కూడా బోల్తా పడ్డాయని తెలిపారు.కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బోగీలు పట్టాలు తప్పడంతో గూడ్స్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మొదటి కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిందని, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ కు చెందిన బోగీలు పట్టాలు తప్పాయని రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.
ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. 13 జనవరి 2022న పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దువార్ వద్ద బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 బోగీలు పట్టాలు తప్పడంతో 9 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు.
2018 అక్టోబర్ నెలలో, రావణ దహన్ సందర్భంగా, పంజాబ్ లోని అమృత్ సర్ లో ఒక భయంకరమైన రైలు ప్రమాదం జరిగింది, దీనిలో 61 మంది మరణించినట్లు ధృవీకరించారు.
2017 ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరయా సమీపంలో ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్ ప్రెస్‌కు చెందిన తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు.
19 ఆగస్టు 2017న హరిద్వార్-పూరీ మధ్య నడిచే కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖతౌలీ సమీపంలో కూలిపోయింది. రైలులోని 14 బోగీలు పట్టాలు తప్పడంతో 21 మంది ప్రయాణికులు మృతి చెందగా, 97 మంది గాయపడ్డారు.
2016 నవంబర్‌ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పింది. ఇందులో కనీసం 150 మంది మరణించారు. మరో 150 మంది గాయపడ్డారు.
20 మార్చి 2015న డెహ్రాడూన్ నుంచి వారణాసి వెళ్తున్న జనతా ఎక్స్‌ప్రెస్‌లో పెను ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీలోని బచ్రావన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఇంజిన్, దానికి అనుబంధంగా ఉన్న రెండు బోగీలు పట్టాలు తప్పడంతో 30 మందికి పైగా మృతి చెందగా, 150 మందికిపైగా గాయపడ్డారు.
2014 మే 26న గోరఖ్ పూర్ వెళ్తున్న గోరఖ్ ధామ్ ఎక్స్ ప్రెస్ ఉత్తర్ ప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ ప్రాంతంలోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొనడంతో  25 మంది మృతి చెందారు. 50 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.
22 మే 2012న హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 25 మంది ప్రయాణికులు మృతి చెందగా, 43 మంది గాయపడ్డారు.
2012 సంవత్సరం భారతీయ రైల్వే చరిత్రలో రైలు ప్రమాదాల పరంగా అత్యంత ఘోరమైన సంవత్సరంగా పరిగణించారు. ఆ ఏడాదిలో 14 ప్రమాదాలు జరిగాయి.
2011 జూలై 7న ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లా సమీపంలో చాప్రా-మథుర ఎక్స్ ప్రెస్ బస్సును ఢీకొట్టింది. రైలు అతివేగంతో వెళ్తుండటంతో బస్సును అరకిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లింది.

Related Posts