YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

కౌంటీ క్రికెట్ నుంచి కోహ్లీ అవుట్..!!

 కౌంటీ క్రికెట్ నుంచి కోహ్లీ అవుట్..!!

 ఇంగ్లాండ్ తో సిరీస్ ముందు కౌంటీ మ్యాచ్లు ఆడాలనుకున్న భారత కెప్టెన్ కోహ్లీ కి నిరాశ ఎదురయింది.గాయం కారణంగా అతడు కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ‘‘ఐపీఎల్‌లో ఆర్‌సీబీ ఆఖరి మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తుండగా కోహ్లి మెడకు గాయమైంది. కోహ్లి జూన్‌లో సర్రే తరఫున కౌంటీ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌లో ఆడాల్సివుంది. ఈ గాయం వల్ల అతడు కౌంటీ క్రికెట్‌కు దూరమయ్యాడు’’ అని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్‌ చౌదరి చెప్పాడు. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌ పర్యటన నాటికి కోహ్లి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడనే నమ్మకంతో బీసీసీఐ వైద్యం బృందం ఉంది’’ అని చౌదరి తెలిపాడు.  
 

Related Posts