YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

3 నెలల్లో 90 వేల వీసాలు

3 నెలల్లో 90 వేల వీసాలు

ముంబై, సెప్టెంబర్ 26, 
ఈ వేసవిలో రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు జారీ చేశామని, మొత్తం 90 వేలు మించిపోయాయని భారత్ లోని యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ  వెల్లడించింది. జూన్, జులై, ఆగస్టు నెలల్ో వీసాలు జారీ చేసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇంత భారీ మొత్తంలో విద్యార్థి వీసాలు జారీ చేయడం భారత దేశం, అమెరికా మధ్య విద్యా మార్పిడిలో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుందని పేర్కొంది. ఈ వేసవిలో ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన వీసాల్లో అత్యధికంగా భారత్ నుంచే ఉన్నాయని తెలిపింది.ప్రపంచవ్యాప్తంగా జారీ అయిన ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత దేశంలోనే జారీ చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ ఎంబసీ తెలిపింది. తమ ఉన్నత విద్యా లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ను ఎంచుకున్న విద్యార్థులు అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసింది. టీమ్ వర్క్, ఇన్నోవేషన్ తో, అర్హత కలిగిన దరఖాస్తుదారులందరూ వారి ప్రోగ్రామ్ లకు సమయానికి చేరుకున్నారని నిర్ధారిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టింది. ప్రస్తుత సెషన్ కోసం స్టూడెంట్ వీసా దరఖాస్తులు ముగిసిన నేపథ్యంలో యూఎస్ మిషన్ ఈ గణాంకాలను విడుదల చేసింది.2022 లో యునైటెడ్ స్టేట్స్ లో అత్యధిక అంతర్జాతీయ విద్యార్థులతో ప్రపంచంలోని అగ్ర దేశంగా భారత్ చైనాను అధిగమించింది. 2020లో దాదాపు 2,07,000 మంది అంతర్జాతీయ భారతీయ విద్యార్థులు యూఎస్ లో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. భారత దేశం నుంచి విద్యార్థులను ఆకర్షించడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు అందించే సులభతరమైన అప్లికేషన్ ఫార్మాలిటీలు, ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్ లు ఈ పెరుగుదలకు కారణంగా విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.ఇంతకు ముందు ఫ్రాన్స్ కూడా భారత్ నుంచి సుమారు 30 వేల మంది విద్యార్థులను ఉన్నత చదువుల కోసం తమ దేశానికి స్వాగతించాలన్న లక్ష్యాన్ని వ్యక్తం చేసింది. 2030 నాటికి భారతీయ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఆ దేశం ప్రయత్నాలు చేస్తోంది. విద్యా నైపుణ్యాన్ని పెంపొందించడం, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక స్నేహాన్ని పెంపొందించడం ద్వారానే ఈ లక్ష్యం సాధ్యం అవుతుందని పేర్కొంది. భారతీయ విద్యార్థులకు బ్రిట‌న్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విదేశీ విద్యార్థుల నుంచి వ‌సూల్ చేసే స్టడీ వీసా ఫీజును భారీగా పెంచేసింది. దాదాపు 127 పౌండ్ల వ‌ర‌కు ఫీజును పెంచారు. మనదేశ కరెన్సీలో పెంచిన మొత్తం రూ.13 వేలకు సమానం. అక్టోబ‌ర్ 4 నుంచే పెంచిన ఫీజులు అమ‌ల్లోకి రానున్నాయి. దీనిపై బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇటీవ‌ల చ‌ట్టం చేశారు. స్టూడెంట్ వీసా ద‌ర‌ఖాస్తు ఫీజును 490 పౌండ్ల వ‌ర‌కు వ‌సూలు చేయ‌నున్నట్లు యూకే హోం ఆఫీసు వెల్లడించింది. స్టూడెంట్ వీసాతోపాటు, ప‌ర్యాట‌కుల‌కు ఇచ్చే విజిటింగ్ వీసా ఫీజును కూడా ప్రభుత్వం పెంచింది. విజిట్ వీసాపై 15 పౌండ్లు పెంచారు. దీంతో ఇప్పుడు ఆ వీసా ఖ‌రీదు 115 పౌండ్లుగా మారింది. ఇది కేవ‌లం 6 నెలల విజిట్ వీసాకు మాత్రమే. అక్టోబ‌ర్ నాలుగో తేదీ నుంచి కొత్త ఫీజులు అమలులోకి రానున్నట్లు యూకే ఇమ్మిగ్రేష‌న్ అధికారులు తెలిపారు. 2021-2022 సీజ‌న్‌లో భార‌త్ నుంచి సుమారు ల‌క్షా 20 వేల మంది చ‌దువు కోసం బ్రిట‌న్ వెళ్లారు. ఆ దేశంలో విద్యను అభ్యసిస్తున్న విదేశీయుల్లో ఇండియ‌న్ల సంఖ్యే ఎక్కువ‌. కీల‌కమైన సేవ‌ల్ని అందించేందుకు ఉద్దేశంతో ఫీజును పెంచిన‌ట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related Posts