YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బ్రాహ్మణ వెల్లంపల్లి.. గ్రామానికి మహర్దశ

 బ్రాహ్మణ వెల్లంపల్లి.. గ్రామానికి మహర్దశ

నల్గోండ, డిసెంబర్ 5,
నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలకు ఓ ప్రత్యేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ గ్రామానికి చెందిన వారే. ఈ ఇద్దరూ తోబుట్టువులు. ఈ సోదరలిద్దరూ 2009 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌గా బ్రాండ్ ఇమేజ్ పొందిన వీరికి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమేమి కాదు.యువనేతగా ప్రజాదరణ పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999లో తొలిసారిగా శాసనసభ్యుడిగా అడుగుపెట్టారు అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూ వస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో అనుహ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా మరోసారి సత్తా చాటారు. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా గెలిచారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిపాలైన రాజగోపాల్ రెడ్డి తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2022లో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తర్వాత జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేశారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేతిలో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 15 నెలల పాటు బీజేపీలో కొనసాగిన రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు.ఇదే గ్రామానికి చెందిన కోమటిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు చిరుమర్తి లింగయ్య 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నకిరేకల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన చిరుమర్తి లింగయ్య 2018 లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ కండువా కప్పుకుని ఈ ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఓటమిపాలయ్యారు.దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో ఈ ముగ్గురు నేతలను బ్రాహ్మణ వెల్లంల చట్టసభలకు పంపింది. జిల్లా రాజకీయాలను ప్రభావితం చేస్తూ రాష్ట్ర జాతీయస్థాయి నేతలుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ముద్ర వేసుకున్నారు. ఈ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి విజయం సాధించారు. ఇద్దరు రాజకీయ నేతలను అందించిన కోమటిరెడ్డి కుటుంబం, బ్రాహ్మణ వెల్లంల గ్రామం రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. దీంతో ఎన్నికల్లో ఒకే గ్రామం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు.
ఒకే ఒక్కడు
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్గజ నేతలంతా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారే. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో హేమాహేమీలైన కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డిః, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సీనియర్ నేతలుగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ జిల్లాలో గులాబీ జెండా ఎగరడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డి వంటి దిగ్గజాలు ఓటమి పాలయ్యారు.ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుని నల్లగొండను గులాబీ కొండగా మార్చింది. అయినా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య నిత్యం మాటల యుద్ధం కొనసాగుతూ ఉండేది. ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శపధం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పవనాలు వేయడంతో 12 స్థానాలకు గాను 11 స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసింది.11 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పరాజయం పాలయ్యారు. అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ఒక్కడు కాంగ్రెస్ పార్టీతో పోరాడి గెలిచాడు ఆయనే మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నుంచి పోటీ చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి దామోదర్ రెడ్డి పై 4,606 ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఒంటి చేతితో బీఆర్ఎస్‌ను గెలిపించిన మంత్రి జగదీశ్ రెడ్డి, ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌తో ఒంటరి పోరు చేసి విజయం సాధించారు. సూర్యాపేట నుంచి ఈ గెలుపుతో మంత్రి జగదీశ్ రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తన గెలుపుతో బీఆర్ఎస్ ప్రాతినిధ్యాన్ని జగదీష్ రెడ్డి కొనసాగిస్తున్నారు.

Related Posts