
హైదరాబాద్
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం ముహుర్తం మారింది. ఎల్బీ స్టేడియంలో గురువారం రోజున జరగబోయే రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చేశారు. గరువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ముందు గురువారం ఉదయం 10.28 గంటలకు ప్రమాణస్వీకారం చేయడానికి ముహుర్తం నిర్ణయించగా తాజాగా మధ్యాహ్నం 1.04 గంటలకు మార్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు రానున్నారు.