YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జార్ఖండ్ సీఎంగా చంపై సోరైన్

జార్ఖండ్ సీఎంగా చంపై సోరైన్

రాంచీ, ఫిబ్రవరి 1,
రాంచీ: ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. భూమికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  అనంతరం రాజ్‌భవన్ కు వెళ్లిన ఆయన గవర్నర్ రాధాక్రిష్ణన్ కు తన రాజీనామా లేఖను సమర్పించారు. శాసనసభా పక్షనేతగా ఎన్నికైన జేఎంఎం సీనియర్ నేత, మంత్రి చంపై సోరెన్ సైతం హేమంత్ సోరెన్ వెంట రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు.ఝార్ఖండ్ మంత్రి అలంగీర్ అలం మీడియాతో మాట్లాడుతూ.. హేమంత్ సోరెన్ సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు. సీనియర్ నేత చంపై సోరెన్ ను శాసనసభా పక్షనేతగా ఎన్నికున్నాం, ఆయన ఝార్ఖండ్ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని పేర్కొన్నారు.మరోవైపు, మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్న హేమంత్ సోరెన్ ఈడీ కస్టడీలో ఉన్నారని జేఎంఎం నేతలు తెలిపారు. ఈడీ కస్టడీ నుంచే రాజ్ భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు కావాల్సిన సంఖ్యా బలం ఉందని స్పష్టం చేశారు. జనవరి 29 లేక 31 తేదీలలో ఈడీ విచారణకు హాజరుకావాలని హేమంత్ సోరెన్ కు నోటీసులు అందాయని పార్టీ వర్గాల సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాంచీలోని హేమంత్ సోరెన్ నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. చుట్టుపక్కల 100 మీటర్ల మేర 144 సెక్సన్ విధించారు. ఈడీ తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించి విచారణ జరుపుతోందని వాదిస్తున్న హేమంత్ సోరెన్.. కొన్ని గంటలపాటు అదృశ్యం కావడం కలకలం రేపింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ సైతం కేసు విచారణ సమయంలో అదృశ్యం కావడం తెలిసిందే. భూమి యాజమాన్య హక్కుల బదలయింపు విషయంలో సీఎం హేమంత్ సోరెన్‌గా భారీగా లబ్ధిచేకూరిందని ఆరోపణలు ఉన్నాయి.హేమంత్ సోరెన్ జైలుకు వెళ్తే ఆయన భార్య కల్పనా సోరెన్ కు సీఎం పీఠం ఇవ్వాలనుకున్నారు. అయితే ఫ్యామిలీలోనే సీఎం కుర్చీ వివాదం మొదలైంది. హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ను సీఎం చేస్తూ చూస్తూ ఊరుకునేది లేదని సీతా సోరెన్ బహిరంగ ప్రకటన చేశారు. సీతా సోరెన్ ఎవరంటే.. జేఎంఎం అధినేత శిబు సోరెన్‌ పెద్ద కోడలు. తనకు ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉందని, ఏం చూసి కల్పనా సోరెన్ ను సీఎం చేస్తారని సీతా సోరెన్ ప్రశ్నించారు. జేఎంఎం ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీ ఎమ్మెల్యేలు చర్చించి శాసనసభాపక్ష నేతగా సీనియర్ నేత, ఝార్ఖండ్ మంత్రి చంపై సోరెన్ ను ఎన్నుకున్నారు. జేఎంఎం సీనియర్ నేత చంపై సోరెన్ గతంలోనూ ఝార్ఖండ్ మంత్రిగా సేవలు అందించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 7 పర్యాయాలు ఎన్నికల్లో విజయం సాధించారు. జేఎంఎంలో చేరకముందు ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఝార్కండ్ టైగర్ గా చంపై సోరెన్ ను వ్యవహరిస్తారు.

Related Posts