YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కూటమి కడుతున్న కమలం

కూటమి కడుతున్న కమలం

చెన్నై, ఫిబ్రవరి 8,
తమిళనాడు రాజకీయాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ద్రవిడ వాదం. అక్కడ రాజకీయ పార్టీల పేర్లలో ద్రవిడ అనే పదం లేకుండా చూడలేం. అలా లేని పార్టీ సక్సెస్ అయిన చరిత్ర లేదు. అలాంటి చోట పాగా వేసేందుకు భారతీయ జనతా పార్టీ పెద్ద స్కెచ్చే వేసింది. ఇప్పటిదాకా తమిళనాట నాలుగు దశాబ్దాలుగా ఎడిఎంకే, డీఎంకే మధ్యనే ప్రధాన పోరు నడిచింది. మూడో కూటమి ప్రయత్నాలు పలు పార్టీలు చేసినా ఫలితం సూన్యం. కానీ ఇప్పుడు బిజెపి మూడో కూటమి ప్లాన్ చూస్తే మాములుగా లేదు. ప్రస్తుతం తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే కూటమికి ధీటుగా కూటమిని ఏర్పాటు చేస్తోంది. బీజేపీ కూటమిలోని పార్టీల లిస్ట్ చూస్తే.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే మూడో స్థానానికి వెళ్లిపోయిందా అన్నట్లుంది.తమిళనాట లోక్ సభ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. అక్కడ పోరు ఇప్పటిదాకా రెండు పార్టీల మధ్యే ప్రధానంగా ఉండేది ఇప్పటిదాకా. బీజేపీ ఉనికి అనేది కూడా అక్కడ అంతంత మాత్రమే. 2021 అసెంబ్లీలో ఎడిఎంకే కూటమిలో పోటీచేసిన బీజేపీ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ఇప్పుడు జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టికెట్లు తీసుకోవడం కాదు. మేమే ఇస్తామంటూ తమిళ పార్టీలను తమ కూటమిలోకి లాక్కుంటోంది. అధికార డీఎంకే గత ఎన్నికల్లో 39 స్థానాలకు 38 ఎంపీలను గెలుచుకుంది. ఎడిఎంకే ఒకే ఒక్క స్థానం అదికూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు గెలుపొందారు. ఈసారి కూడా మొత్తం స్థానాలను స్వీప్ చేయాలన్న కసితో ఉంది అధికార డీఎంకే. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది.ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడిఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, విజయ్ కాంత్‎కు చెందిన డీఎండీకే, టి.ఎం.సి పోటీ చేయగా.. ఈ సారి బీజేపీ బయటకు రావడంతో పాటు ఎడిఎంకేతో ఉన్న పార్టీలన్నింటిని తమ కూటమిలోకి తీసుకుంది. సరిగ్గా చెప్పాలంటే ఎడిఎంకే కూటమిలో అన్ని పార్టీలు కలిసి అదే పార్టీని ఒంటరి చేశాయని చెప్పాలి. పీఎంకే తమిళనాట అగ్రకులమైన వన్నియార్ సమాజికవర్గంలో బలమైన ఓటుబ్యాంకు కలిగిన పార్టీ. పీఎంకే 12 స్థానాలు అడుగుతుండగా 7 స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. డీఎండీకే 14 స్థానాలు కోరుతూండగా 4 స్థానాలు ఒక రాజ్యసభ సీటు ఇచ్చేవిధంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎడిఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వంను కూడా కలుపునునే వ్యూహంతో ఉంది కమలం పార్టీ.

Related Posts