YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ లో కంటైనర్ ఆస్పత్రి

గుజరాత్ లో కంటైనర్ ఆస్పత్రి

గాంధీనగర్, ఫిబ్రవరి 20
ప్రధాని నరేంద్ర మోదీ 24, 25 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా గుజరాత్‌లోని తొలి ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శిస్తారు.. అంతే కాదు IPD సర్వీస్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనతో రాజ్‌కోట్ సహా సౌరాష్ట్ర కేంద్రం నుంచి మరో భారీ బహుమతిని అందుకోనుంది. రాజ్‌కోట్ సమీపంలోని పరపిపలియా గ్రామంలో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించారు. అక్కడ దేశంలోనే తొలి కంటైనర్ హాస్పిటల్ కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు.. దేశవ్యాప్తంగా పనిచేస్తున్న 23 ఎయిమ్స్‌లో రాజ్‌కోట్, భువనేశ్వర్ ఎయిమ్స్ మాత్రమే కంటైనర్ హాస్పిటల్ ప్రయోగానికి ఆమోదం పొందాయి. దీనికి స్థలం కూడా కేటాయించబడింది.ఈ కంటైనర్ హాస్పిటల్ సహాయంతో, AIIMS మొబైల్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు.. వెంటనే ఈ మొబైల్‌ ఆస్పత్రి సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ఇందులోని వైద్య సిబ్బంది బాధితులకు అక్కడికక్కడే చికిత్స అందజేస్తారు. ఈ కంటైనర్‌ ఆస్పత్రిలో దాదాపు 15 ప్రత్యేక చికిత్సలు కూడా ఉంటాయని అధికారులు వెల్లడించారు.. దీని తరువాత, మల్టీస్పెషాలిటీ చికిత్సతో సహా మొత్తం 23 చికిత్సలు సమీప భవిష్యత్తులో దశలవారీగా అందుబాటులోకి వస్తాయని చెప్పారు.రాజ్‌కోట్‌లోని పారా పిప్లియా గ్రామంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్‌లో భాగమైన ఆసుపత్రి పునరుద్ధరణ పని పూర్తైంది. ఫిబ్రవరి 25 నుండి ప్రధాని చేతుల మీదుగా IPD ప్రారంభించబడుతుంది. ఇప్పటికే ఏర్పాట్ల హడావుడి మొదలైంది. AIIMSలో రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉంచారు. దీంతో రోగులు గుజరాత్ నుంచి ఇతర ప్రాంతాలకు చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడకు వచ్చే రోగులకు అవసరమైన నాణ్యమైన వైద్యం అందించేలా మంచి సౌకర్యాలు కల్పిస్తున్నారు. సౌరాష్ట్రలోని మారుమూల ప్రాంతాలైన ద్వారక, సోమనాథ్‌ల ప్రజలు చికిత్స కోసం అహ్మదాబాద్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయితే తీవ్ర వ్యాధులకు చికిత్స పొందేందుకు ప్రజలు చెన్నై, ముంబై, ఢిల్లీలకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్థిక వ్యయం కూడా చాలా ఎక్కువయ్యుది. రాజ్‌కోట్‌లో ఎయిమ్స్‌ అందుబాటులోకి వస్తుండటంతో సౌరాష్ట్ర ప్రజలు ఆరోగ్య రంగంలో చాలా పెద్ద బహుమతిని పొందుతున్నారని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి 25న రాజ్‌కోట్ ఎయిమ్స్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాజ్‌కోట్ ఎయిమ్స్‌లో IPD చికిత్స కూడా అందుబాటులో ఉంటుంది. 190 మంది వైద్యులు, 318 మంది నర్సింగ్ సిబ్బంది రోగులకు సేవలందించేందుకు, చికిత్స అందించనున్నారు. 250 ఐపీడీ బెడ్లను ప్రారంభించనున్నారు. ఇందులో 25 పడకలను ఐసీయూతో ఉంచుతారు. 250 పడకల ఆపరేషన్ థియేటర్‌తో పాటు 250 ఐపీడీ పడకలను ప్రారంభించనున్నారు. ఐపీడీతో పాటు కొత్తగా 15 సేవలను ప్రారంభించనున్నట్టు రాజ్ కోట్ ఎయిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సీడీఎస్ కటోచ్ తెలిపారు. ఇందులో అత్యవసర చికిత్స, అడ్మిషన్‌కు బెడ్‌ సౌకర్యం, ఆపరేషన్‌ థియేటర్‌, ఫిజియో, ఈఎన్‌టీ, సర్జరీ, డెంటల్‌, ఫిజికల్‌ విభాగం, ఎకో వంటి సదుపాయాలు కూడా ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25న గుజరాత్‌లోని తొలి ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించనున్నారు.

Related Posts