హైదరాబాద్
హైదరాబాద్ ఓఆర్ర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. ఎమ్మెల్యే కారు రోడ్డు పక్కనున్న బారికెడ్ ను బలంగా ఢికొట్టింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అయనను ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నందిత కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు ఆమె దివంగత నేత సాయన్న కూతురు.
ఎమ్మెల్యే లాస్య నందినికి ప్రమాదాలు వెంటాడాయి . గతంలో లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుండి బయటి పడింది. నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెంటవ సారి ప్రమాదానికి గురయ్యారు. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక. యువఎమ్మెల్యే మృతి చెందారు. ఎమ్మెల్యే కారు. పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ప్రమాదానికి గురైంది.