YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్లే స్టోర్ లో స్వచ్చత యాప్

ప్లే స్టోర్ లో స్వచ్చత యాప్

ముంబై, ఫిబ్రవరి 26
మీ ఇంటి పరసరాల్లో చెత్త పేరుకుపోతోందా.. దుర్గంధం వెదజల్లుతోందా.. కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయా.. డ్రెయినేజీ నీరు పొంగి రోడ్లపైకి వస్తోందా.. దుర్వాసన భరించలేకపోతున్నారా.. రోడ్లపై నడవడం ఇబ్బందిగా ఉందా.. అయితే ఈ సమస్యలన్నింటికీ ఒకే ఒక పరిష్కారం ఆ యాప్‌ చూపిస్తుంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఆ యాప్‌ను డౌప్‌లోడ్‌ చేసుకుని అందులో మీ ఇంటి పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, మురికి నీటి ఫొటోలను అప్‌లోడ్‌ చేయడమే. ఇంతకీ ఆ యాప్‌ ఏంటి.. ఎలా పనిచేస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.ఇండియన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ యాప్‌ను లాంచ్‌ చేశారు. దానిపేరే స్వచ్ఛత. దీనిని గూగుల్‌ ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. తర్వాత యాప్‌లో మనకు సంబంధించిన అనేక సమస్యలు అందులో కనిపిస్తాయి.యాప్‌లో మీరు ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత మీ సమీపంలో ఉండే సమస్యకు సంబంధించిన ఫొటోలను తీసి అప్‌లోడ్‌ చేయాలి. ఇది పూర్తిగా జీపీఎస్‌తో కనెక్ట్‌ అయి ఉంటుంది. ఫొటోతోపాటు లొకేషన్‌ కూడా ఆ ఏరియాలో క్లీనింగ్‌ చేయించే సీనియర్‌ ఆఫీసర్‌కు వెళ్తుంది. వాళ్లు సిబ్బందిని పంపించి క్లీనింగ్‌ చేయిస్తారు.
అధికారులు సమస్య పరిష్కరించిన తర్వాత దానికి సంబంధించిన ఫొటోలను తీసి మళ్లీ అదే యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సమాచారాన్ని మున్సిపల్‌ ఆఫీసర్‌కు కూడా పంపించాల్సి ఉంటుంది. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటేనే వ్యాధులకు దూరంగా ఉంటాం. అందేకే కేంద్రం ఈ స్వచ్ఛత యాప్‌ను తీసుకువచ్చింది. ఇంకేముంది మీరు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని మీ సమస్యకు మీరే పరిష్కరం చూపండి.

Related Posts