YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నాలుగు ఏనుగు దంతాలు @ 8 కోట్లు

నాలుగు ఏనుగు దంతాలు @ 8 కోట్లు

బెంగళూరు, మార్చి9
బెంగళూరులో ఏనుగు దంతాలతో వెళుతున్న వాహనాన్ని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ యూనిట్‌కి చెందిన అధికారులు ఏనుగు దంతాలను అక్రమంగా తరలిస్తున్న వాహనంను తనిఖీ చేశారు.. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బెంగుళూరు శివారు ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఒక ఆటోలో ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్న క్రమంలో ఒక సమాచారంతో ఈ వాహనాన్ని డిఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. ఆటోలో ఒక బ్యాగ్‌లో ఏనుగు దంతాలను దాచి వీరు ప్రయాణిస్తున్నారు. రెండు ఏనుగు దంతాలను ఒక పెద్ద బ్యాగులో దాచి బ్యాగును సీటు వెనకాల దాచిపెట్టారు. వీటిని అక్రమ రవాణా చేస్తోన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సిండికేట్‌తో సంబంధం ఉన్న నలుగురు అదనపు అనుచరులను అధికారులు గుర్తించి పట్టుకున్నారు.వైల్డ్‌లైఫ్ ప్రొటక్షన్ యాక్ట్  1972 సెక్షన్ 50 ప్రకారం ఏనుగు దంతాలను అక్రమంగా తరలించడం నిషేధం. ఈ క్రమంలో ఏనుగు దంతాలను తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రెండు ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు ఏనుగు దంతాలు 6.8 కిలోలు ఉన్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 8 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.వన్యప్రాణుల సంరక్షణ యాక్ట్ లో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి 2023లో కొత్త అమెండ్మెంట్ ని తీసుకొచ్చారు. వీటి ద్వారా అక్రమంగా వన్య ప్రాణులను తరలిస్తున్న వారిపై చర్యల కోసం డిఆర్ఐ అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. దీంతో గత ఏడాది భారీగా ఏనుగు దంతాల ను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు డిఆర్ఐ అధికారులు. గత ఏడాది ఏనుగు దంతాలు తరలిస్తున్న ఆరు వాహనాలను అధికారులు గుర్తించి తనిఖీ చేశారు. మొత్తం 57.5 కేజీల ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, చెన్నై, కలకత్తా, బెంగళూరు ప్రాంతాల్లో ఈ ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts