YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తీహార్ జైలుకు కేజ్రీవాల్

తీహార్ జైలుకు కేజ్రీవాల్

న్యూఢిల్లీ,  ఏప్రిల్ 1
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టులో మరో షాక్ తగిలింది. ఆయన్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించేందుకు కోర్టు ఓకే చెప్పింది. దీంతో ఆయన్ని కోర్టుకు తరలించారు. కోర్టు ఆదేశాల మంరకు 15 రోజుల పాటు తిహార్ జైలులో ఉండబోతున్నారు. ఇప్పటికే ఇదే కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అక్కడే ఉన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా అదే జైల్లో ఉన్నారు. లిక్కర్‌ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మార్చి 21 రాత్రి అరెస్టు చేశారు. 22న కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఈడీ కస్టడీకి ఇవ్వడంతో ఏడు రోజుల పాటు విచారించారు. విచారణ గడువు పూర్తి కావడంతో ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. 28న విచారణ గడువు ముగిసినప్పటికీ కోర్టుకు సెలవులు కారణంగా ఇవాళ హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా ఈడీ తరఫున ఎస్వీ రాజు వాదిస్తూ... విచారణకు కేజ్రీవాల్‌ సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ఆయన్ని మరోసారి కస్టడీకి ఇవ్వాలని రిక్వస్ట్ పెట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారిగా ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టు అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కవిత, మాజీ డిప్యూటీ సీఎంలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు. ఈ స్కామ్‌లోని డబ్బులనే ఆమ్‌ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల్లో వినియోగించినట్టు చెబుతోంది. దర్యాప్తు సంస్థ చేస్తున్ నఆరోపణలు కేజ్రీవాల్ సహా ఆప్ నేతలు ఖండిస్తున్నారు. లోక్‌ సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయకుండా ఉండేందుకే కేంద్రం కక్ష పూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని ్ంటున్నారు.

Related Posts