YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

28 శాతం పెరిగిన రాహుల్ ఆదాయం

28 శాతం పెరిగిన రాహుల్ ఆదాయం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4,
కేరళలోని వాయనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీచేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన అమేథీ, వాయనాడ్‌ స్థానాల నుంచి బరిలో నిలిచారు. కానీ, కాంగ్రెస్ కంచుకోట అమేథీలో ఓడిపోయి, వాయనాడ్‌లో గెలిచారు. ప్రస్తుతం ఆయన కేవలం వాయనాడ్‌నే ఎంచుకున్నారు. రాహుల్ గాంధీ వాయనాడ్‌లో బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి రాగా, కోలాహలంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా రాహుల్ వెంట ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. నామినేషన్ వేసే ముందు 2 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ రోడ్‌షా సాగింది. ఈ సందర్భంగా జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన రాహుల్ గాంధీ.. తన చెల్లెలు ప్రియాంక గాంధీని ఎలా చూసుకుంటానో, వాయనాడ్ ప్రజలను కూడా తన కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటానని అన్నారు. మీ ప్రతినిధిగా పార్లమెంటులో ఉండట తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తాను అని తెలిపారు. కేరళలోని మొత్తం 20 స్థానాలకు ఏప్రిల్ 26న రెండో దశలో పోలింగ్ జరగనుంది. నామినేషన్‌కు గురువారంతో గడువు ముగినుంది. నామినేషన్ అనంతరం రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. వాయనాడ్ బస్లాండ్, కాలనీల్లో ఆయన ప్రచారం చేశారు.రాహుల్ గాంధీ సమర్పించిన ఎన్నికల అఫిడ్‌విట్ ప్రకారం.. ఆయన ఆస్తుల విలువ రూ.20.4 కోట్లు. ఐదేళ్లలో తన ఆస్తులు రూ.6 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఆస్తుల విలువ రూ.14 కోట్లుగా అఫిడ్‌విట్‌లో తెలిపారు. గతం కంటే 28 శాతం పెరిగింది. ఆయనపై 18 క్రిమినల్ కేసులున్నట్టు తెలిపారు. వీటిలో ‘మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టు దోషిగా నిర్దారించిన కేసు కూడా ఉంది. దీనిపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ అనర్హత నుంచి తప్పించుకున్నారు. ఇక, మార్చి 15 నాటికి తన వద్ద రూ.55 వేల నగుదు, రెండు బ్యాంకు ఖాతాల్లో రూ.26,25,157 ఉన్నట్టు వెల్లడించారు.ఎంపీగా వేతనం, అద్దెలు, బ్యాంకు వడ్డీ, బాండ్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు నుంచి ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈక్విటీలు, మ్యూచివల్ ఫండ్లు, సేవింగ్ ఖాతాలు, గోల్డ్ బాండ్లు విలువ రూ.9.24 కోట్లుగా పేర్కొన్నారు. వీటిలో ఈక్విటీ షేర్లు రూ.4.33 కోట్లు, మ్యూచివల్ ఫండ్లు రూ.3.81 కోట్లు. వాణిజ్య భవనాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు సహా స్థిరాస్థులు 11.15 కోట్లుగా వివరించారు.

Related Posts