YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీ అండర్ 272

బీజేపీ అండర్ 272
లోక్ సభలో బీజేపీ మెజార్టీ క్రమంగా తగ్గుతోంది. ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ ఎన్డీఏ కూటమి నుంచి కొన్ని పార్టీలు బయటకు వెళ్లడం, మరికొన్ని చోట్ల బీజేపీ ఓడిపోవడంతో ఆమేరకు సభ్యుల సంఖ్యను నష్టపోతోంది. ఉప ఎన్నికల ఫలితాల్లోను బీజేపీకి షాక్ న్యూస్ వచ్చింది. ఫలితంగా సభలో ఆసభ్యుల సంఖ్య పలుచబడింది. అతి స్వల్ప మెజారిటీతో నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్ సభలో ఇప్పుడు 539మంది సభ్యులే ఉన్నారు. స్పీకర్‌ను మినహాయిస్తే బిజెపికి 272 సీట్లు వున్నాయి. లోక్‌సభలో మొత్తం 545 స్థానాలు ఉంటాయి. ఇందులో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు. వారిని పరిగణనలోకి తీసుకోరు. ఫలితంగా 543 సీట్లను లెక్కగడతారు. వాటిలో నాలుగు స్థానాలు ఖాళీగా వున్నాయి. కర్నాటకకు చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయగా, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌సీటులో ఉప ఎన్నిక నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. నామినేటెడ్‌ సభ్యులు ఇద్దరూ కూడా ఆ పార్టీకే చెందినవారు కావడంతో సభలో బిజెపి బలం 274కి చేరింది. 541సభ్యులు గల సభలో మెజారిటీకి అవసరమైన 271కన్నా మూడు స్థానాలు ఎక్కువగా బిజెపికి ఇప్పుడు వున్నాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లతో సహా ఉప ఎన్నికల్లో ఓటమి పాలైంది కమలం పార్టీ. 
2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన 282 సీట్లు. ఇప్పుడు 10 సీట్లు తగ్గాయి. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకు 336 ఉండేవి. టీడీపీ, శివసేన, ఝార్ఘండ్ పార్టీలు బయటకు వెళ్లాయి. ఫలితంగా 315సీట్లు బీజేపీకి ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు జరిగిన నాలుగు లోక్‌సభా స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి ఒక్కటే గెలుచుకోగలిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి వీటిలో మూడు గెలిచింది. కానీ ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో ఒక్కొక్కటి కోల్పోయింది. ఇక జరగాల్సిన నాలుగు ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని వస్తాయో తెలియదు. కాబట్టి బీజేపీ హవా తగ్గుతుందనే చెప్పాలి. 

Related Posts