YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కుదిరిన డీల్...2019ఎన్నికల్లో కలిసి పోటి

కాంగ్రెస్, జేడీఎస్ మధ్య కుదిరిన డీల్...2019ఎన్నికల్లో కలిసి పోటి

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య డీల్ కుదిరింది. కేబినెట్ కూర్పుపై రోజుల తరబడి చర్చల తర్వాత ఒప్పందం కుదరడంతోపాటు 2019ఎన్నికల్లో కలిసి పనిచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఇప్పుడన్నీ సెటిలైపోయాయి అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. జేడీఎస్‌కు ఆర్థిక శాఖ అప్పగించిన కాంగ్రెస్.. హోంశాఖతో పాటు బెంగళూరు నగర అభివృద్ధి శాఖను తీసుకుంది.ఐదు రౌండ్ల సమావేశం తర్వాత రెండు పార్టీలు ఓ అవగాహనకు వచ్చాయి. ఓ కోఆర్డినేషన్ అండర్ మానిటరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ కనీసం నెలకోసారైనా సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాలనలో వచ్చే విభేదాలను పరిష్కరించడంతోపాటు ప్రతి చట్టబద్ధమైన బోర్డులు, సంస్థల నియామకాలపై తుది నిర్ణయం ఈ కమిటీకే ఉంటుంది. జేడీఎస్‌కు ఆర్థిక శాఖతోపాటు విద్య, కార్పొరేషన్, ఫిషరీస్, రవాణా, ఇంటెలిజెన్స్ ప్లానింగ్ మంత్రిత్వ శాఖలు దక్కాయి.ఇక కాంగ్రెస్‌కు హోంశాఖతోపాటు వ్యవసాయం,ఆరోగ్యం, రెవెన్యూ, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలు దక్కాయి. మే 24 నే కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసినా ఇప్పటికీ కేబినెట్ కొలువుదీరని విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో మంత్రుల ప్రమాణస్వీకారం తేదీని నిర్ణయించడానికి సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిశారు.

Related Posts