YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆరోగ్యశ్రీ కోసం 203 కోట్లు

ఆరోగ్యశ్రీ కోసం 203 కోట్లు

విజయవాడ, మే 22
ఆరోగ్య శ్రీ సేవల పెండింగ్ బిల్లుల కోసం ఏపీ ప్రభుత్వం 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 1500 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఇవాల్టి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్‌ అసోసియేషన్‌ నిన్న ప్రకటించింది. సేవలను కొనసాగించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ అధికారులకు, హాస్పిటల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో నిన్న చర్చించారు.సేవలు కొనసాగించాలని కోరారు. త్వరలోనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గతంలోనూ ఇలాగే చెప్పినప్పటికీ బిల్లుల చెల్లింపులు జరగలేదని హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. సేవల కొనసాగింపు కొనసాగించేది లేదని తేల్చి చెప్పారు. ప్రకటనలు తప్ప బిల్లుల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నట్టు తమకు కనిపించడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.దీంతో.. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతాయని అనుకున్నారు. కానీ.. ప్రభుత్వం హుటాహుటిన 203 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో హాస్పిటల్‌ అసోసియేషన్‌ ఎలా స్పందిస్తుంది అనేది తేలాల్సి ఉంది. సేవలు కొనసాగిస్తారా? లేదా అనేది తేలాల్సి ఉంది.

Related Posts