
మల్కాజిగిరి
మల్కాజిగిరి ఎంపీ గా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈటల రాజేందర్ మల్కాజిగిరి కి విచ్చేశారు, ఉదయాన్నే సఫిల్ గుడా మినీ ట్యాంక్ బండ్ పై వాకర్స్ కి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వారి
సమస్యలు అడిగి తెలుసుకున్నారు, మల్కాజ్గిరి లోని రైల్వే క్రాసింగ్ సమస్యలు కూడా తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు జిహెచ్ఎంసి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టుకుని తనను భారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజిగిరి ప్రజలకు రుణపడి ఉంటానని వారి సమస్యల పరిష్కారం దిశగా ఎల్లప్పుడూ పని చేస్తానని హామీ ఇచ్చారు.