
న్యూఢిల్లీ, జనవరి 28,
ఢిల్లీ ఎన్నికల యుద్దంలో గ్యారంటీ వార్ కొనసాగుతోంది. ఎన్నికల హామీల విషయంలో ఆప్, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. బీజేపీ మూడు మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో పథకాలను ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా కేజ్రీవాల్ కూడా కొత్త ఎత్తుగడ వేశారు. ఇన్నాళ్లూ ఒక్కో పథకాన్ని ప్రకటిస్తూ వచ్చిన ఆమ్‌ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్, పూర్తిస్థాయి మేనిఫెస్టోని ప్రకటించారు. 15 గ్యారంటీలను ఆయన ప్రకటించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే మా తొలి ప్రాధన్యత అని అన్నారు కేజ్రీవాల్. – మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామన్నారువాటర్ మాఫియాకు చరమగీతం పాడుతానని కేజ్రీవాల్ ప్రకటించారు. సీనియర్ సిటిజన్లకు సంజీవని యోజన పథకం అమలు చేస్తామన్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, అంబేద్కర్ స్కాలర్‌షిప్ స్కీమ్, ఢిల్లీ మెట్రోలో 50% రాయితీ కల్పిస్తామని తెలిపారు. 24 గంటల పాటు ఉచిత మంచినీటి పథకం , యమునా నదిని కాలుష్య రహితంగా చేయడం.. ఢిల్లీ రోడ్లను బాగు చేయడం తమ ప్రధాన లక్ష్యమన్నారు మోదీ.యితే కేజ్రీవాల్ తీరుపై మండిపడ్డారు బీజేపీ నేతలు యమునా నది జలాలు విషతుల్యం కావడానికి ఆప్ పాలనే కారణమన్నారు. పంజాబ్‌లో అంబేద్కర్ విగ్రహం ధ్వంసానికి కేజ్రీవాల్ బాధ్యత వహించాలంటూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు పొరుగున్న ఉన్న హర్యానా , యూపీ బీజేపీ ప్రభుత్వాలు కలుషిత జలాలను విడుదల చేస్తున్నాయని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే కేజ్రీవాల్ మరో కొత్త డ్రామా మొదలుపెట్టారని బీజేపీ విమర్శించింది.