YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమల్లోకి వాట్సప్ సేవలు

అమల్లోకి వాట్సప్  సేవలు

నెల్లూరు, జనవరి 30, 
ఆంధ్రప్రదేశ్ మరో కీలక సంస్కరణను అమలు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో తొలిసారిగా...ప్రభుత్వ పౌరసేవలు, ప్రజల నుంచి వినతులు స్వీకరణ, అవసరమైన సమాచారం అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనుంది. జనవరి 30 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయిజ వాట్సాప్ సేవలను మంత్రి నారా లోకేశ్  ప్రారంభించారు. తొలివిడతలో 161 ప్రభుత్వ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వెరిఫైడ్ ట్యాగ్ తో అధికారిక వాట్సాప్‌ నంబర్‌ను అందుబాటులో తెస్తామన్నారు. ఈ వాట్సాప్ నెంబర్ వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుందన్నారు. భవిష్యత్తులో ఈ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు.ఈ విధానంలో ప్రభుత్వం నేరుగా ప్రజలకు సమాచారం అందిస్తుంది. వాట్సాప్‌ అకౌంట్ లో భారీవర్షాలు, వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటన, విద్యుత్ అంతరాయం. పిడుగులు పడే అవకాశం, మీ ప్రాంతంలో జరిగే అభివృద్ధి పనులపై సమాచారాన్ని ఒకేసారి కోట్ల మందికి వాట్సాప్ ద్వారా చేరవేయనుంది.ప్రజలు తమ సమస్యలపై వినతులు, ఫిర్యాదులు చేయవచ్చు. ప్రభుత్వ నెంబర్ కు మెసేజ్‌ చేస్తే, వెంటనే వారికి ఒక లింక్‌ పంపిస్తారు. అందులో సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్‌ నెంబర్, అడ్రస్, సమస్యలను టైప్‌ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్‌ నెంబర్ ఇస్తారు. దీని ఆధారంగా వారి సమస్య పరిష్కారం ఎంత వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. తమ ప్రాంతంలోని డ్రైనేజీ కాలవల లీకేజీలు, రహదారుల గుంతలు ఫొటోలు తీసి పంపవచ్చు. వాతావరణ కాలుష్యంపై వాట్సాప్ లో ఫిర్యాదులు చేయొచ్చు. ప్రభుత్వం అమలుచేసే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అర్హతలు, లబ్ధి గురించి వాట్సప్‌ నెంబర్ కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు.రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల సమాచారాన్ని వాట్సాప్‌లో తెలుసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని, టికెట్లు, వసతి సహా అన్ని బుక్‌ చేసుకోవచ్చు. విద్యుత్తు బిల్లులు, ఆస్తి పన్నులను అధికారిక వాట్సాప్‌ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ట్రేడ్‌ లైసెన్సులు పొందవచ్చు. దేవాలయాల్లో దర్శన టికెట్లు, వసతి బుకింగ్, విరాళాలు పంపడం చేయవచ్చు. అదే విధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన భూ రికార్డుల యాక్సెస్, వివిధ సర్టిఫికెట్లు వాట్సాప్ ద్వారా పొందవచ్చు."దేవదాయ, ఇంధనం, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్న క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలకు సంబంధించిన 161 ప్రభుత్వ సేవలు రేపటి నుంచి వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. దేశంలోనే వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 22న మెటా సంస్థతో ఒప్పందం చేసుకున్నది. ధ్రువపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బంది ఇక ప్రజలకు తప్పుతుంది"- సీఎం చంద్రబాబు

Related Posts