
మేడ్చల్
మేడ్చల్ జిల్లా నాచారం నుంచి కుంభమేళాకు వెళ్లిన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుంభమేళ ప్రయాగరాజు నుండి తిరుగు ప్రయాణం లో ఘటన జరిగింది. మధ్యప్రదేశ్ జబల్పూర్ శిరోహి ప్రాంతంలో మంగళవారం ఉదయం 9 గంటల పది నిమిషాలకు సంఘటన జరిగింది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారని వార్త. ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరంతా నాచారం రాఘవేంద్ర నగర్, కార్తికేయ నగర్ కు చెందిన వారు. రాఘవేంద్ర నగర్ చెందిన శశికాంత్ కుటుంబసభ్యులను మేడ్చల జిల్లా కలెక్టర్, బీజేపీ నేతలు ఫోన్ లో పరామర్శించారు. .
మృతులు ఆనంద్ కన్సారి, శశి కాన్సారి, రవి విశ్వనాథన్, టీవీ ప్రసాద్ , మల్లారెడ్డి, బాలకృష్ణ శ్రీ రామ్, రాజు.