YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు

ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు

మిర్యాలగూడ:
ఎమ్మెల్యే కోటాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ , పిసిసి చీప్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి,రాష్ట్ర భారీ, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార్లు, ఎంపీలు రఘువీర్ రెడ్డి, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల అందరికీ డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మా నాన్న కూడా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ రెండుసార్లు సర్పంచ్ గా పని చేశాడని వివరించారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, ఎంపీపీగా, జెడ్పిటిసిగా, గత ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, పార్టీ శ్రేణులందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శంకర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts