YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలపై స్పందించాలి

న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలపై స్పందించాలి

హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టల విషయంపై కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి  అమిత్ షా స్పందించాలని మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి మాట్లాడారు.  ప్రస్తుతం అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయినా         యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్లకట్టల ఆరోపణలు దేశం మొత్తం  అలజడి సృష్టించినా ఈ డి ఐ టి ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులపై సాధారణ వ్యక్తులపై ఈడిని ఐటీని ప్రయోగిస్తున్న కేంద్ర ప్రభుత్వం సుమారు 500 కోట్లకు పైగా నోట్లు కాలిపోయినట్లు ఆరోపణలు వచ్చిన విషయంపై ఎందుకు మిన్నకున్నారని ప్రశ్నించారు.  ఏ స్థాయిలో అవినీతి జరిగితే ఆ స్థాయిలో నోట్ల కట్టలు బయటపడతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టిసారించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయవ్యష్టపై నమ్మకాన్ని పెంపొందించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ లకు ప్రభుత్వ టెండర్లలో కర్ణాటక తరహాలో ఇతర రాష్ట్రాలలో కూడా 24 పర్సెంట్ ప్రభుత్వం టెండర్లు ఇవ్వాలని కోరారు.  బడా పారిశ్రామిక లకు గుజరాత్ వ్యాపారులకు మార్వాడీలకు మాత్రమే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని వారితోపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం రుణాలు మంజూరు చేయాలని కోరారు.  పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ఈడీ కేసులు  విచారకరమని అన్నారు ‌ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిత్యం ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకే రాజ్యాంగబద్ధ సంస్థలను అక్రమంగా వినియోగిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తన తీరు మార్చుకొని ప్రజలకు మంచి పాలన అందించాలని కోరారు.

Related Posts