
కొడిమ్యాల,
ఓ అవ్వా! ఎటుపోతున్న వే సంచులు బాగా పట్టుకుని పోతున్నావు అని అడిగింది లచ్చమ్మ నర్సమ్మను ఎటు లేదవ్వ గా జగిత్యాల లో ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు ఇక్కడికన్నా అగ్గో అత్తున్నాయట గాడికోయ్యి తీసుకొద్దామని పోతున్నా అని చెప్పింది నర్సవ్వ అయ్యో గట్లనా జర్ర ఆగరాదు నేనుకూడా అత్త సంచులు పట్టుకొని అన్నది లచ్చవ్వ ఇద్దరు కలసి బస్టాండ్ కాడి కెళ్ళి నిలవడి బస్ కోసం ఎదురు సూడంగానే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఎల్లవ్వ కనిపించింది. ఓ ఎల్లవ్వ నువ్వేటు పోతున్నావే బస్సు కాడికచ్చినవ్ అనంగానే ఎటులేదే మీరు మాట్లాడుకునేది ఇన్నానే నేను గూడ ఉల్లిగడ్డలు కొంకుందామని అచ్చిన అన్నది నీ బస్ ఇంకా అత్తలేదు గీ బస్సు ఎప్పుడు అత్తదో ఏమో అని అటు ఇటు సూడంగానే కట్టే పట్టుకుని అటు ఓ ముసలయ్య అచ్చిండు. అగొ గీ తాతమన రాములు తాత లెక్కనే ఉన్నాడు. ఓ రాములు తాతా ఏడికే పోతున్నావు గీ బస్సు దగ్గరికి అచ్చినవ్ అని అడగంగానే జగితలా పొయ్యత్త బిడ్డా! ఓ రెండు ధోతుల జోడలు కొంకచ్చు కుంటా అని అచ్చిన గాని మమ్మల్ని బస్సు యెడ ఎక్కనిత్తండ్లు మొత్తం ఆడోళ్ళ తోటే నిండి పాయె మేము ఎక్కి నంక నిలువడి నిలవడి సచ్చేంత పనవుతుంది అనగానే ఎల్లవ్వ ఇంకా నయ్యం నీ పని నయ్యముంది ఇప్పుడు, ఇప్పుడు మా ఆడోళ్ళను సూడంగానే బస్సు ఆపకుంటా బుర్రు మని పోతుండ్లు ఆర్టీసీ వాళ్లకు కూడ అర్థమయ్యింది వీళ్లంతా అట్టి పనులకు కూడ బస్సులల్ల తిరుగుతుండ్లని అందుకే గీ ఉచిత పథకం ఏది ఇచ్చిన ప్రజలను మెప్పించే విధంగా ఉండి ప్రజలకు కూడ బాధ్యత కల్పించే విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పు కుంటపోతుంది ఎల్లవ్వ అంతలోనే బస్సు హారన్ వినిపించింది. బస్సు వచ్చి ఆగగానే ఒకళ్ల మీద ఒకళ్ళు పడి బస్సు ఎక్కారు.