
కమాన్ పూర్
రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో శుక్రవారం జై భీమ్ జై బాపు జై సంహిదాన్ కార్యక్రమాన్ని రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాప్పన్న మరియు రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే పోశం మరియు బేగంపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు.జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ భారీ ర్యాలీలో తాజా మాజీ ఎంపీపీ అరేల్లి దేవక్క - కొమరయ్య గౌడ్ పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఫోటోలు, రాజ్యాంగం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు రాజ్యాంగం విలువను తెలుపుతూ తాజా మాజీ ఎంపీపీ రేల్లి దేవక్క - కొమరయ్య గౌడ్ గారు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ....
కేంద్ర బీజేపీ పాలనలో రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం హక్కులను కాలరాస్తు, మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి సిద్ధాంతాలను విస్మరిస్తుందన్నారు. భారత రాజ్యాంగాన్ని దేశ సమగ్రతను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదముతో పెద్ద ఎత్తున ఉద్యమిద్దమని పిలుపునిచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అంటే ప్రధాని మోదీకి ఏమాత్రం విలువ లేదని, అందుకే పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను కించపర్చే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం అంటే బీజేపీ దృష్టిలో పుస్తకం మాత్రమేనని, కానీ తమ దృష్టిలో రాజ్యాంగం అంటే పవిత్ర గ్రంథం అని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే 'జై బాపు, జై భీమ్, జై సంవిధాన్' కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. పేదలంటే మోదీకి పట్టింపే లేదని, ఆయన ధ్యాసంతా దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడంపైనే ఉందని నాయకులు ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో బేగంపేట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కల్వల శంకర్ యూత్ అధ్యక్షులు ఊదరి కుమార్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొరకొప్పుల తులసిరాం గౌడ్ తీగల రాజమల్లు శ్రీరాముల కుమార్ యాదవ్ బొంతల సదానందం కొత్తూరి మోహన్ సుద్దాల కిరణ్ లక్కార్తి మల్లయ్య గుండా శ్రీనివాస్ రేణికుంట్ల కొమురయ్య రేగళ్ళ రాజేశం అనవేణ రాజమల్లు మాతంగి కుమార్ రంగం దశరథం కందుకూరి శ్యామ్ అమ్మ సారయ్య బరుపటి కొమురయ్య ఆరంద రాజు లక్కార్తీ శ్రీను తాళ్లపల్లి అంజయ్య మరియు హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు .