
హైదరాబాద్, ఏప్రిల్ 26,
గత కొద్దిరోజుల నుండి ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి పై పలు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంతో బిజీ గా గడుపుతున్న ఆయన, ఈటీవీ షో లో 24 సీజన్స్ ని పూర్తి చేసుకున్న ‘పాడుతా తీయగా’ సింగింగ్ షోలో న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షో ద్వారా రీసెంట్ గానే ఎలిమినేట్ అయిన ప్రవస్తి కీరవాణి, చంద్రబోస్ , సునీత వంటి వారిపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం పై కీరవాణి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న కీరవాణి పై ఇప్పటి వరకు ఇలాంటి సంచలన ఆరోపణలు ఎవ్వరూ చెయ్యలేదు. ఆ అంశంపై కీరవాణి కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంత మంది ఉంటే, వ్యతిరేకించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మరియు ఇతర మతాలను అగౌరవపరిచాడు అంటూ కొన్ని హిందూ సంఘాలకు చెందిన ప్రముఖులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకు ఆయన ఏమన్నాడంటే ‘నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను. కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే కేవలం ఈ మతం లో మాత్రమే క్షమించే తత్త్వం ఉంటుంది. మిగతా మతాల్లో అది కనపడదు’ అంటూ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజెన్స్ మామూలు రేంజ్ లో ఫైర్ కాలేదు. ముఖ్యంగా హిందూ మతానికి సంబంధించిన వారు అయితే కీరవాణి ని ఏకిపారేస్తున్నారు. ఇతని సినిమాలు బ్యాన్ చేయాలి అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. ఒక గురువును కీరవాణి ని ఉద్దేశిస్తూ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారాయి. ఇంతకు అతను ఏమి మాట్లాడాడో క్రింది వీడియో లో చూడండి. ఇక కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి తో ‘విశ్వంభర’ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. రీసెంట్ గానే ‘రామ రామ’ అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి కూడా ఆయన సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఈ రెండు కాకుండా ప్రస్తుతం పాన్ వరల్డ్ చిత్రం మహేష్ బాబు, రాజమౌళి చిత్రానికి కూడా ఈయనే సంగీత దర్శకుడు.