
కరీంనగర్
టిఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్ళు అవుతున్న సందర్భంగా ఆదివారం రజతోత్సవ సభకు భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యకర్తల తరలింపుకై ప్రత్యేక ఆహ్వానాలు అందిస్తున్నారు. గ్రామాల్లో దండోరాతో చాటింపు చాటారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గంగాధర మండలం బూరుగుపల్లిలో డప్పు కొట్టి దండోరా వేయించారు. సిరిసిల్లలో ఇంటింటికీ తిరిగి బొట్టు పెట్టి ఆహ్వాన లేఖలు బిఆర్ఎస్ నాయకులు అందచేసారు. కరీంనగర్ మంచి ఎల్కతుర్తి వరకు దారి పొడవున స్వాగత తోరణాలు గులాబీ జెండాలతో పార్టీ నాయకులు నింపేసారు.