
ఆదిలాబాద్
ఇచ్చోడ మండలం గాంధీనగర్ గ్రామం వద్ద అతి క్రూరంగా పశువులను అక్రమ రవాణా చేస్తున్న లారీను డ్రైవర్ నడి రోడ్డుపై విడిచి పెట్టి పారిపోయాడు. అనుమానం వచ్చి పోలీసులు లారీని తనిఖీ చేయగ దయనీయమైన స్థితిలో 42 ఎద్దులు, 10 ఆవులు వున్నాయి. అతి క్రూరంగా పశువులను లారిలో కుక్కడంతో ఊపిరి ఆడక ఒక ఆవు మృతి చెందింది. మరికొన్ని పశువులు అస్వస్థతకు గురయ్యాయి. పశువులకు ప్రథమ చికిత్స చేయించి, గోశాలకు తరలించారు. పశువుల అక్రమ రవాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.