
మెదక్
కాశ్మీర్లో చిక్కుకుని పోయిన మెదక్ వాసులు సురక్షితంగా స్వగృహాలకు చేరుకున్నారు. రోటీన్ పనిలో పడిపోయారు. మెదక్ పట్టణం నుండి కపిల్ చిట్ ఫండ్ కంపెనీ ద్వారా టూర్ ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఈ నెల 22 ఉదయం 2 గంటల సమయంలో చిట్ఫండ్ మేనేజర్ పవన్ ఐదుగురి బృందం మెదక్ నుంచి బయలు దేరారు. మరునాడు శ్రీనగర్ చేరుకున్నారు. పహాల్గావ్ లో జరుగుతున్న ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో వీరిని హోటల్లోనే చిక్కుకుని పోయారు. ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. మరోవైపు కుటుంబ సభ్యులు బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఎంపీ రఘునందన్ రావు వారికి భరోసా కల్పించారు. శ్రీనగర్ నుండి శనివారం తెల్లవారుజామున సురక్షితంగా మెదక్కు చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు.