YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉగ్రవాదులకు 10 మంది కశ్మీర్ లు సాయం

ఉగ్రవాదులకు 10 మంది కశ్మీర్ లు సాయం

శ్రీనగర్, ఏప్రిల్ 29, 
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఉగ్రదాడికి తెగబడ్డ ఉగ్రవాదులు.. పర్యాటకులను వారి మతం అడిగి మరీ కాల్చిచంపారు. అయితే.. ఈ ఘటనపై విచారణకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)ను ఆదేశించింది. అయితే తాజాగా ఉగ్రవాద దాడిపై జరిపిన దర్యాప్తులో దాడి జరిగిన సమయంలో 10 మందికి పైగా కశ్మీరీ ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌లు దాడి చేసిన వారితో ప్రత్యక్ష సంబంధంలో ఉన్నారని తేలింది.
ఈ OGWలు చాట్ చేయడానికి, ఉగ్రవాదులలో సమన్వయం చేయడానికి ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ అప్లికేషన్‌లను ఉపయోగించి, ఉగ్రవాదులతో రియల్ టైమ్ కమ్యూనికేషన్‌ను కొనసాగించినట్లు సమాచారం. ఏప్రిల్ 23 నుండి పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశంలో ఉన్న జాతీయ దర్యాప్తు సంస్థ  బృందాలు ఆధారాల కోసం అన్వేషణను ముమ్మరం చేశాయి. ఉగ్రవాద నిరోధక సంస్థకు చెందిన IG, DIG, SP నేతృత్వంలోని బృందాలు ఏప్రిల్ 22న జరిగిన దాడిని గమనించిన ప్రత్యక్ష సాక్షులను ఇప్పటికే ప్రశ్నించాయి ఉగ్రవాదుల కార్యనిర్వహణ విధానాల ఆధారాల కోసం దర్యాప్తు చేస్తున్న NIA బృందాలు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను నిశితంగా పరిశీలిస్తున్నాయి. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ భయంకరమైన దాడి వెనుక ఉన్న ఉగ్రవాద కుట్రను వెలికితీసేందుకు ఆధారాల కోసం ఫోరెన్సిక్, ఇతర నిపుణులు మొత్తం ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే, పహల్గామ్‌లో జరిగిన దాడి తర్వాత ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం అనేక శోధన కార్యకలాపాలను ప్రారంభించి, అప్రమత్తంగా ఉంది.

Related Posts